Home » చనిపోయిన పెద్దలు పితృ దేవతలు కాదు.. మరి పితృ దేవతలు అంటే ఎవరు..?

చనిపోయిన పెద్దలు పితృ దేవతలు కాదు.. మరి పితృ దేవతలు అంటే ఎవరు..?

by Sravya
Ad

చాలా మందికి అసలు పితృదేవతలు అంటే ఎవరు అనే విషయం తెలీదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, చనిపోయిన మన పూర్వీకులే పితృదేవతలు అని భావిస్తారు. అయితే అది మాత్రం నిజం కాదు. మరి పితృదేవతలు అంటే అసలు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం…. పితృదేవతలు మనందరికీ రావాల్సిన రాకపోకలని, పొందాల్సిన గతులని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ దేవతా వ్యవస్థని పితృదేవతలు అని అంటారు.

Advertisement

చనిపోయిన తర్వాత మనం మన పెద్దలకి పిండ ప్రదానం చేస్తాము. ఆ పిండాన్ని వారికి చేరేలా పితృదేవతలే ఆ గతులని నిర్ణయిస్తారు. ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత మళ్లీ ఇంకో జన్మని పొందేందుకు 300 సంవత్సరాలు పడుతుంది. కొన్ని కొన్ని సార్లు జీవి వెంటనే జన్మించొచ్చు కూడా. అది సంకల్ప బలముతో కూడి ఉంటుంది. చనిపోయిన వాళ్ళు వెంటనే జన్మించినా కూడా పితృ కర్మల ఫలితం వాళ్లకి దక్కుతుంది. మనం పెట్టిన పిండం ఏదో ఒక రూపంలో వాళ్లకి వెళ్తుంది.  ఉదాహరణకి చనిపోయిన వ్యక్తి మేకలాగ పుడితే గడ్డి మొదలైన ఆహార రూపాల్లో వాళ్ళకి మనం పెట్టిన పిండం చేరుతుంది.

Advertisement

అది చూసి పితృదేవతలు సంతోష పడతారు. ఒకవేళ మనం చేసింది వాళ్ళకి అవసరం లేకపోయి వాళ్ళు ఉత్తమ గతుల్ని పొందినట్లయితే.. మనం చేసే పితృకర్మల ఫలితం మన కోరికలని తీర్చే విధంగా ఉపయోగపడుతుంది. అంతే కానీ అది ఏమీ కూడా వృధా కాదు ఒకవేళ చనిపోయిన వాళ్ళు దేవతా లోకంలో దేవతలుగా ఉన్నట్లయితే, ఆ పిండాలు అమృత రూపంలో వాళ్ళకి చేరుతాయి. ఇలా ఏ రూపంలో అయితే వాళ్ళు వుంటారో దానికి తగ్గట్టుగా మనం చేసే పిండ ప్రధానం వారికి అందుతుంది.

Also read:

 

Visitors Are Also Reading