Home » నిహారిక కంటే ముందే విడాకులు తీసుకున్న సినీ స్టార్స్ వీరే..!

నిహారిక కంటే ముందే విడాకులు తీసుకున్న సినీ స్టార్స్ వీరే..!

by Anji
Ad

టాలీవుడ్  ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిలు సర్వసాధారణం. కానీ ప్రేమ పెళ్లిలు చాలా వరకు పెటాకులుగానే మారుతున్నాయి. చాలా తక్కువ జంటలు మాత్రమే జీవితాంతం కలిసి ఉంటున్నాయి. ఇలా విడిపోయిన వారిలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారు ఎవరెవరో ఇప్పుడే మనం తెలుసుకుందాం. 

Advertisement

అక్కినేని నాగార్జున 1984లో డాక్టర్ రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని 1990లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక ఆ తరువాత అమలను వివాహం చేసుకున్నాడు నాగార్జున. 

Manam News

హీరో కమల్ హాసన్ 1978లో 24 ఏళ్ల వయస్సులో నర్తకి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత నటి సారికను పెళ్లి చేసుకున్నాడు కమల్ హాసన్.  2002లో సారికకు కూడా విడాకులు ఇచ్చాడు.  ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. 

Manam News

పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తొలుత నందిని ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ విడాకులు ఇచ్చి ఇప్పుడు రష్యాకి చెందిన అన్నా లెజినోవా ని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈమెకి కూడా విడాకులు ఇవ్వనున్నాడనే రూమర్స్ కూడా వినిపిస్తుండటం గమనార్హం. 

Manam News

ప్రేమించి పెళ్లి చేసుకున్నహీరోల లిస్ట్ లో సుమంత్ కూడా ఉన్నారు. హీరో సుమంత్, నటి కీర్తి రెడ్డి రెండేళ్లకే విడిపోయారు. సుమంత్ తో విడాకులు తీసుకున్న తరువాత కీర్తి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం. 

Manam News

మంచు మనోజ్-ప్రణతిరెడ్డిలది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం వీరిది. కొద్ది రోజుల పాటు కలిసి ఉన్న వీరు.. విభేదాల కారణంగా విడిపోయారు. ఇటీవలే భూమా మౌనికారెడ్డిని వివాహం  చేసుకున్నాడు మంచు మనోజ్. 

Manam News

Advertisement

ప్రముఖ సింగర్ సునీత తొలుత కిరణ్ తో వివాహం జరిగింది. వారికి కూతురు శ్రేయ, ఆకాశ్ అనే పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు. ఈ మధ్య సింగర్ సునిత నిత్యం వార్తల్లో నిలవడం విశేషం. 

Manam News

సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహ నంబియార్ ను 1990లో పెళ్లి చేసుకున్నారు. తరువాత స్నేహకు సైతం శరత్ బాబు విడాకులు ఇవ్వడం విశేషం. 

Manam News

1985లో ప్రముఖ సినీ నటి రాధిక  ప్రతాప్ పోతన్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తరువాత పోతనకు విడాకులు ఇచ్చింది రాధిక. రెండోసారి లండన్ కి చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఇక ఆ తరువాత 2001లో హీరో శరత్ కుమార్ ప్రేమలో పడి మరో వివాహం చేసుకున్నారు. 

నాగచైతన్య-సమంత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఏమాయే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో మునిగితేలారు.  2017లో వీరి పెళ్లి జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరు 2021లో విడిపోయారు. 

నిహారిక- చైతన్య ల వివాహం డిసెంబర్ 9, 2020న గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ జంట కూడా విడాకులు తీసుకున్నట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత మంది విడాకులు అసలు ఎందుకు తీసుకుంటున్నారు అని పలువురు చర్చించుకుంటున్నారు. కొంత మంది అయితే సినీ ఇండస్ట్రీలకు, సెలబ్రెటీలకు పెళ్లి, విడాకులు కామన్ అని.. ముఖ్యంగా డబ్బులు ఉన్న వారు ఏది చేసినా నడుస్తుందని అంటారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

SALAAR TEASER : కేజీఎఫ్ ని మించిన ప్రభాస్ ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే..!

 “నాకేం తక్కువ.. నిహారికకు ఏం తక్కువ?”.. వైరల్ అవుతున్న మంచు లక్ష్మి కామెంట్స్!

పవన్ కళ్యాణ్ నుంచి నిహారిక వరకు.. మెగాఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకుంది వీరే!

Visitors Are Also Reading