ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఏం కొనాలన్నా ఆన్లైన్ లోనే కొంటున్నాం…డబ్బు చెల్లించాలన్నా ఆన్లైన్ లోనే చెల్లిస్తున్నాం. ఇక ఆన్లైన్ చెల్లింపులకు ఫోన్ పే, పేటియం, గూగుల్ పే అను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే టప్పుడు జాగ్రత్తగా లేకుంటే జేబులకు చిల్లు పడే ప్రమాదంఉంది. కాబట్టి ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెబైల్ బ్యాంకింగ్ యాప్ ల ద్వారా స్నాన్ చేయడం లేదా నంబర్ ఎంటర్ చేసి షాపింగ్ లు చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో హాకింగ్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు బ్యాంక్ అకౌంట్ లు వినియోగించడం ఉత్తమం. అన్లైన్ బ్యాంకింగ్ చేసే అకౌంట్ లో ఖర్చులకు సరిపోయే డబ్బును మాత్రమే ఉంచడం మంచింది. లేదంటే ఖర్చులకు సరిపడా డబ్బును యూపీఐ పేమెంట్ లు కాకుండా యాప్ లో వేసుకుని వాడటం ఉత్తమం.
Advertisement
ఒక స్మార్ట్ ఫోన్ తో పాటూ ఒక డబ్బా ఫోన్ వాడటం ఉత్తమం. అంతే కాకుండా ఓటీపీ వచ్చే సిమ్ ను డబ్బా ఫోన్ లో వేయాలి. డబ్బు ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో ఓటీపీ తప్పని సరి కాబట్టి ఏదైనా యూఆర్ఎల్ పంపి కూడా డబ్బా ఫోన్ ను హ్యాక్ చేయలేరు.
Advertisement
పాస్ వర్డ్ ను వీలైనంత స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. చాలా మంది తమ పుట్టిన తేదీలు..ఇంటి పేర్లు పిల్లల పేర్లను పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ లు మన సోషల్ మీడియాలో ఉంటాయి కాబట్టి అలా చేయకూడదు.
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు కూడా అసలు డేట్ ఆఫ్ బర్త్ లు వాడకూడదు. జంబ్లింగ్ చేస్తూ నంబర్ లను ఎంపిక చేసి పాస్ వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలి.
ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డులు ఇవ్వకూడదు. సిమ్ తీసుకున్న సమయంలో ఇచ్చిన జిరాక్స్ కు కూడా ఏ పర్పస్ కోసం ఇస్తున్నామో దానికోసమే జిరాక్స్ ఇస్తున్నట్టు ఆ జిరాక్స్ పై రాసి సంతకం చేయాలి.
also read : వయాగ్రా వల్ల కోమా నుండి భయటపడిన మహిళ..ఎలాగంటే..?