Home » రెడీ అయిన ‘ఆచార్య’ ట్రైల‌ర్‌..!

రెడీ అయిన ‘ఆచార్య’ ట్రైల‌ర్‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై వ‌స్తున్న ‘ఆచార్య’ సినిమా వ‌చ్చే వేస‌వికాలంలో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌వుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి విడుద‌లైన శానా క‌ష్టం, పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మ‌ణిశ‌ర్మ బాణాలు స‌మ‌కూర్చిన ఈ సినిమా పాట‌ల‌కు చిరంజీవి, రెజీనా పై చిత్రీక‌రించారు. ఈ పెప్పీ నెంబ‌ర్ ఆడియ‌న్స్ ను ఉర్రూత‌లూగిస్తోంది. ఈ పాట‌లో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

 

Release date of Chiranjeevi and Ram Charan's Acharya is out | The News Minute

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే ఆల‌యాల నేప‌థ్యంలో దేవాదాయ శాఖ‌లో అక్ర‌మాల‌పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ రెడీ అయింది. త్వ‌ర‌లోనే దీనిని విడుద‌ల చేయ‌బోతున్నారు. యూఏఈ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు ఈ ట్రైల‌ర్ రివ్యూని ట్విట‌ర్ లో పోస్ట్ చేసాడు. ట్రైల‌ర్ ఫైన‌ల్ క‌ట్ లాక్ అయిందంటూ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ మ‌ళ్లీ మాస్ మ‌సాలాతో వ‌చ్చార‌ని ట్వీట్ చేశాడు.

Acharya Official Concept Trailer | Megastar Chiranjeevi | Koratala Siva | Niranjan Reddy |Ram Charan - YouTube

చిరంజీవి అంటేనే మాస్ మాసాలా అని, ట్రైల‌ర్ పూర్తిగా అలాగే ఉంటుంద‌ని చెప్పేశాడు ఉమైర్ సంధు. ఈ ఆచార్య ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతోంది. ఈ సినిమా త‌రువాత చిరంజీవి వ‌రుస‌గా సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. ఇటు రామ్ కూడా ఆర్ఆర్ఆర్ త‌రువాత శంక‌ర్ సినిమాతో బిజీ కానున్నాడు. ఇక వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో అప‌జ‌యం ఎర‌గ‌ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఆచార్య ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో ఎదురు చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading