Home » అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా..ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా..ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

by Bunty
Ad

అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి నటనలో అమల కూడా ఒకరు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమె తన అద్భుతమైన నటనకు గాను రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక అమల తెలుగులో నిర్ణయం, శివ వంటి సినిమాలలో నాగార్జునతో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

Advertisement

కొన్ని రోజుల తర్వాత వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహ అనంతరం అమల హైదరాబాదుకు మకాం మార్చేశారు. వివాహ అనంతరం అమల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులకే అక్కినేని అఖిల్ కు జన్మనిచ్చారు. కాగా అఖిల్ అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులోనే అతనికి అదృష్టం వరించినప్పటికీ ఈ మధ్యకాలంలో దురదృష్టం అతన్ని వెంటాడుతూనే ఉంది.

Advertisement

అయినప్పటికీ అఖిల్ కు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అఖిల్ అంటే తెగ ఇష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాల్లో నటించిన అతనికి పెద్దగా హిట్ రావడం లేదు. ఈ మధ్యకాలంలో ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే… తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా, అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమలా తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలా తల్లి హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహ అనంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాలలో చాలాకాలం జీవించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !

CM KCR : సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆ క్యాప్ ఎందుకు పెడతారు ?

హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!

 

Visitors Are Also Reading