Home » కోట్లు ఇస్తామని చెప్పినా… పొగాకు యాడ్ చేయలేదు – సచిన్ టెండూల్కర్..

కోట్లు ఇస్తామని చెప్పినా… పొగాకు యాడ్ చేయలేదు – సచిన్ టెండూల్కర్..

by Bunty
Ad

టీమిండియా మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు టీమిండియా క్రికెటర్ గా ఆడిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు.. రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పట్లో సచిన్ గ్రౌండ్లోకి దిగాడు అంటే… బౌలర్లు గజగజ వణికి పోయేవారు. సచిన్ బ్యాడ్ పట్టాడు అంటే కచ్చితంగా సెంచరీలు, లేదా హాఫ్ సెంచరీలు చేసేవాడు.

Advertisement

దీంతో సచిన్ టెండూల్కర్ కు ఇప్పటికీ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే చాలా అడ్వటైజ్మెంట్ లోనూ సచిన్ టెండుల్కర్ ఇప్పటికీ నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా తాజాగా.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సచిన్ టెండూల్కర్. గతంలో పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని కానీ దానికి ఒప్పుకోలేని.. సచిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మహారాష్ట్ర ప్రభుత్వ స్మైల్ అంబాసిడర్ గా నియామకం అయిన సచిన్ టెండూల్కర్.. మీడియాతో మాట్లాడారు. తనగా లైఫ్ లో చాలా ప్రకటనలు చేయాలని ఆఫర్లు వచ్చాయని… అందులో కొన్ని మాత్రమే తాను చేసినట్లు వెల్లడించారు. కానీ పొగాకు ఉత్పత్తుల యాడ్స్ కు మాత్రం ఒప్పుకోవద్దని మా నాన్న చెప్పేవారు… అలాంటి ఆఫర్లు ఎన్నో వచ్చేవి కానీ దానికి నేను అంగీకరించలేదని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Visitors Are Also Reading