దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కాంబినేషన్ లో రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన సినిమా మగధీర. ఈ సినిమాలో తన అంగరక్షకుడు, ప్రేమికుడు అయినటువంటి కాలభైరవ కోసం చేయిజాస్తుంది. అప్పటికే ఆమె కొండ కొమ్ముపై రక్తిసిక్తమై ఉంటుంది. రామ్ చరణ్ స్థితి కూడా అదే. అతను చేయి అందించే సరికి ఆమె లోయలోకి జారి పడిపోతుంది. కాలభైరవ కూడా ఆమె కోసం పరుగెత్తి దూకేస్తాడు. చివరికీ వారిద్దరూ పడిపోవడంలో ఒకరి కోసం ఒకరు చేయి జాబుతుంటారు.
Advertisement
అతని స్నేహితుడు షేర్ ఖాన్ కాలభైరవ రక్షణ కవచానికి చితి అంటించి దిగిపోతున్న సూర్యుడిని చూస్తూ కమ్ముకొస్తున్న చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా అంటుండగా సన్నివేశం ముగిసి అసలు కథ ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మగధీర చిత్రానికి వందల ఏళ్ళ నాటి ఈ మూల కథాంశమే ఆధారం. ఈ సినిమా ఉదయ్ పూర్ రాజ్యానికి యువరాణి మిత్రవింద అత్యంత సౌందర్యవతి, గొప్ప ప్రేమికురాలి పాత్రలో నటించడానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి యూనిట్ సభ్యులు హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచించారు. తొలుత హీరోయిన్ గా తమన్నా ని అనుకున్నారు. ఆ క్రమంలో ముంబైలో ఆమెను సంప్రదించగా మగధీర చిత్ర కథను విన్న తమన్నా చిత్రం చేయడానికి అంగీకరించారు.
Advertisement
కానీ హిందీలో హీరోయిన్ కరీనాకపూర్ తో కలిసి ఒక చిత్రం చేస్తుండడంతో తమన్నా డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దర్శక, నిర్మాతలు అక్కడి నుంచి హైదరాబాద్ వెనుతిరిగారు. ఆ సమయంలో మరో హీరోయిన్ కోసం ప్రయత్నించగా.. అప్పటికే పౌరుడు, ఆటాడిస్తా సినిమాలను పూర్తి చేసిన కాజల్ ని మగధీర చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నారు. రాజమౌళి తో మగధీర చిత్రం చేసే అవకాశం అప్పుడు పోయిందని కానీ, తిరిగి బాహుబలి చిత్రం ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తిరిగి వచ్చిందని హీరోయిన్ తమన్నా ఓ సందర్భంలో వివరించారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మెగాస్టార్ ని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. అందుకోసమేనా ?
అఖిల్ కు హిట్ కోసం నాగార్జున తపన..జక్కన్నకు అన్ని కోట్లు ఇచ్చాడా..?