టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించాడు. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నువ్వే కావాలి సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు తరుణ్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నువ్వే కావాలి తర్వాత ప్రియమైన నీకు,నువ్వులేకనేనులేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తరుణ్.
Advertisement
స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. “ తన కొడుకు పై వస్తున్న రూమర్స్ చూసి నేను చాలా బాధపడ్డాను అని పేర్కొన్నారు. తారును రోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడు ప్రతి ఏడాది తిరుపతికి వెళ్తాడు నాకంటే భక్తి అతనికెక్కువ శని మంగళవారం అసలు నాన్ వెజ్ కూడా తినడు మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటుంటాడు ప్రస్తుతం అభిమానులు ఆశీస్సులతో హ్యాపీగా ఉన్నాము తరుణ్ పెళ్లి ఒక్కటైతే చాలు అంతకు మించింది ఏది లేదు అని పేర్కొంది.
Advertisement
ఇక ఆ పెళ్లి అనేది ఎలాగో అలా అవుతోంది. కానీ తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ వెబ్ సిరీస్ తో పాటు సినిమాలు కూడా చేయబోతున్నాడట. వీటిలో ఏది ముందు విడుదల అవుతుందో మాత్రం చెప్పలేను. మీ ఆశీస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్ళీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను” అని తెలిపారు. తరుణ్ పెళ్లి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. త రుణ్ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తా వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
BREAKING: జనసేనలోకి రఘురామకృష్ణరాజు ?
మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా సూపర్ హిట్ సాధించడానికి మేజర్ రీజన్స్ ఇవే..!