Home » ఎన్టీఆర్-రామానాయుడు మధ్య దాగి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ?

ఎన్టీఆర్-రామానాయుడు మధ్య దాగి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ నటించలేరనే విధంగా పాత్రలోనే లీనమైపోయే వారు. అయితే దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉంది. అలాగే అప్పటి దిగ్గజ నటులు అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సన్నిహిత సంబంధాలతోనే అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ ల పెళ్లి జరిపించారు. కొన్ని అనివార్య కారణాలతో ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, రామానాయుడు కూతురు లక్ష్మీ విడాకులు తీసుకున్నారు. 

Advertisement

ఎన్టీఆర్ తో  కూడా రామానాయుడికి మంచి సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు రామానాయుడు. నిర్మాతగా ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని పలు సందర్భాల్లో గుర్తు చేసుకునే వారు. ముఖ్యంగా దగ్గుబాటి రామానాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా.. నందమూరి తారకరామారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి తొలి టెంకాయ కొట్టేవారు. ఇలాగే రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవం కూడా జరిగింది.   ఇక ఇవే కాదు.. తన ఇంట్లో పెళ్లిళ్లు.. ఏవైనా శుభకార్యాలు జరిగినా అన్నింటినీ ఎన్టీఆర్ తోనే ప్రారంభించేవారు.

Advertisement

ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా రామానాయుడు రాజకీయాల్లో కొనసాగారు. అంతేకాదు.. ప్రకాశం జిల్లాలో ప్రచార బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఇలా ఎన్టీఆర్ ఎంతో అవినాభవ సంబంధం కొనసాగించిన రామానాయుడు తెలుగుదేశం పార్టీ తరుపున బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఎన్టీఆర్ తో రామానాయుడికి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ మరణించిన తరువాత మాత్రం వారి కుటుంబ సభ్యులు, కుమారులు ఎన్టీఆర్ మాదిరిగా అటు రామానాయుడుతో కానీ, ఇటు రామానాయుడు వారసులతో కానీ అంతగా సంబంధాలు కొనసాగించకపోవడం గమనార్హం. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. మరో హిట్ కొట్టాలని ఫిక్స్ !

సమంతకి విడాకులు ఎందుకు ఇచ్చాడో చెప్పేసిన నాగచైతన్య.. అందుకోసమా ?

Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారు రహస్యాలు చెబితే వారికి కష్టాలు తప్పవు..!

Visitors Are Also Reading