Ramabanam Review: గోపీచంద్ హీరోగా రూపొందిన ‘రామబాణం’ సినిమా ఇవాళ విడుదల అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై గోపీచంద్ చాలా నమ్మకంతో ఉన్నారు. లక్ష్యం, లౌక్యం తర్వాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి గోపీచంద్ చేసిన సినిమా ఇది. అంతేకాకుండా లక్ష్యం తర్వాత గోపీచంద్, జగపతిబాబు కలిసి నటించిన చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాతో నైనా గోపీచంద్ కు బ్రేక్ రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!
Advertisement
కథ మరియు వివరణ :
యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ అన్నతమ్ముళ్ల అనుబంధంగా సాగింది. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథగా చిత్రాన్ని తెరకెక్కించగా, కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైన కష్టాలని ఎలా ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? హీరోకి జగపతిబాబు ఎలాంటి సపోర్ట్ అందించాడు అనేది వెండితెరపై చూడాల్సిందే.
Advertisement
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!
ఈ చిత్రంలో గోపీచంద్, జగపతిబాబు, డింపుల్ హయాతి, కుష్బూ, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. గోపీచంద్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం నటనతో అలరించింది. టెక్నికల్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే దర్శకుడు శ్రీవాస్ సినిమాలో యాక్షన్ కామెడీని సరైన నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నించాడు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమా చూసుకోవడం ప్లస్ అయింది. మిక్కీ జే మేయర్ బిజిఎం యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.
ప్లస్ పాయింట్లు:
కామెడీ
యాక్షన్
మైనస్ పాయింట్లు :
ఊహించదగిన కథనం
సినిమా రేటింగ్: 2.5/5
READ ALSO : IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?