Telangana Tenth, Inter Results: మొన్నటి వరకు టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షాలన్నీ ముగియడంతో స్కూల్ కు మరియు కాలేజీలకు వేసవి కాల సెలవులు ఇచ్చారు. కానీ ప్రస్తుతం విద్యార్థులంతా టెన్త్, ఇంటర్ రిజల్ట్ కోసం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఈ ఎడారి అన్ని పరీక్షలు సక్రమంగా సాగాయి, దీనికంటే 2 ఇయర్స్ ముందు కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించు కోలేకపోయారు. కానీ ఈసారి అన్ని సక్రమంగా ఉండడంతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి.
also read:నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?
Advertisement
Advertisement
ఇక తెలంగాణ విద్యార్థులంతా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అని విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో అధికారులు ఏమో ఆలస్యమైనా సరే గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్లీ జరగకుండా ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయంతో ఉన్నారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు సంబంధించి 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ 4,82,677మంది, సెకండ్ ఇయర్ 4,65,022 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు
దీనికి సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ఇప్పటికే పూర్తయింది. టేబులేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇంకా టెన్త్ ఫలితాలు విడుదలకు సంబంధించి అధికారులు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంలో టెన్త్ ఇంటర్ ఫలితాలను ఈ వారంలోనే ఒకటి రెండు రోజుల తేడాతో విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ నెల 15వ తేదీలోపు టెన్త్, ఇంటర్ రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
also read:ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!