మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. మార్చి 3న తన స్నేహితురాలు భూమా మౌనికతో ఏడడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించాడు మంచు మనోజ్.
Also Read : దాసరి, చిరు ల మధ్య విబేధాలు, మనస్పర్థలు ఇంతలా ఉండేవా ? చివరికి ఏమయ్యిందంటే ?
Advertisement
మౌనికతో పాటు ఆమె కొడుకు ధైరవ్ రెడ్డి బాధ్యత కూడా తనదేనని తెలియజేస్తూ.. శివాజ్ఞ అంటూ ట్వీట్ చేశారు. మనోజ్ పెళ్లి బాధ్యతలను సోదరి మంచు లక్ష్మీ అన్ని తానై చూసుకున్నారు. మనోజ్, మౌనిక పెళ్లి మంచు లక్ష్మీ ఇంట్లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువు కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి తరువాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తదుపరి సినిమాల షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పై ఆసక్తికర ట్వీట్ చేశారు.
Advertisement
చరణ్ ఉపాసన తమకు ఓ గిప్ట్ పంపి సర్ ప్రైజ్ చేసారని తెలిపారు మనోజ్. పాలరాతితో చేసిన జంట స్వేచ్ఛగా విహరిస్తున్నట్టుగా ఉన్న ఓ బహుమతిని పంపి ఆశీర్వాదం అందించారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. సర్ ప్రైజ్ గిప్ట్ అనేవి అద్భుతంగా ఉంటాయి. థాంక్యూ చరణ్, ఉపాసన మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురుచూస్తున్నాను. మాల్దీవులు ట్రిప్ ముగియగానే కలుద్దాం. ప్రేమతో M&M అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవలే దుబాయ్ వెకెషన్ వెళ్లారు చరణ్, ఉపాసన దంపతులు. ఈ ట్రిప్ ముగియగానే ఏప్రిల్ 08న మాల్దీవులకు వెళ్లారు. ప్రస్తుతం తన సినిమాకు కొద్దిపాటు గ్యాప్ రావడంతో చరణ్ దంపతులు వెకేషన్ వెళ్లినట్టు తెలుస్తోంది.
Also Read : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి