ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్ మ్యాచ్ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో ముంబై జట్టు ఆడిన మొదటి మ్యాచ్ ఓడిపోయింది. బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్. అయితే.. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో ఓటమిని ముంబై చవిచూసింది.
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
Advertisement
శనివారం వాంకడే వేదికగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోను ముంబై విఫలమైంది. తొలి వికెట్ కు వీరిద్దరూ 38 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కిషన్ తన దూకుడును కొనసాగించి పవర్ ప్లే ముగిసే సరికే తమ స్కోర్ బోర్డును 60 పరుగులు దాటించాడు. అయితే కిషన్ అవుటైన అనంతరం ముంబై పతనం మొదలైంది. వరుస క్రమంలో ముంబై ఇండియన్స్ వికెట్లు కోల్పోయింది.
Advertisement
READ ALSO : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు టికెట్ ధరలు..టైమింగ్స్ ఇవే
ఆఖరిలో టీమ్ డేవిడ్ (31) పరుగులతో రాణించడం వల్ల ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 18.1 ఓవర్లలో చేదించింది. ఇక ఆ సీఎస్కే చేతిలో ఘోర ఓటమిని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోయాడు. సీఎస్కే విజయం సాధించగానే రోహిత్ తన క్యాప్ తో ముఖం దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ముంబై తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్ తో తెలపడనుంది.
READ ALSO : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…