ప్రతి ఒక్కరు తమ జీవితంలో తప్పకుండా ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటారు. అయితే సొంత గ్రామంలో లేదా జీవించడానికి ఇతర గ్రామాలకు వెళ్లినా.. అక్కడ అయినా కొత్త ఇంటిని నిర్మించుకుంటారు. అయితే కొత్త ఇంటిని నిర్మించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరుపుతారు.
Advertisement
అయితే అయితే చాలా మంది గృహ ప్రవేశం చేసుకునే సమయంలో గోవులను తీసుకువస్తారు. కొత్త ఇంటి లోకి తమ కంటే ముందే.. ఆవులను పంపిస్తారు. అయితే గృహ ప్రవేశాలకు ఆవులను ఎందుకు తీసుకువస్తారో ఎప్పుడు అయినా ఆలోచించారా. దాని వల్ల లాభం ఎంటి అని ఎప్పుడు అయిన తెలుసుకున్నారా. అయితే ఈ ఆర్టికల్ లో మనం నూతన గృహ ప్రవేశ కార్యక్రమాలలో ఆవులను ఎందుకు తీసుకుస్తారో తెలుసుకుందాం.
Advertisement
ఎవరైనా నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేసుకుంటే వారు తప్పకుండా ఆవులను తీసుకువస్తారు. అంతే కాకుండా తమ కంటే ముందే నూతన ఇంట్లోకి ఆవులను పంపుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే.ఆవులకు దుష్ట శక్తిని కనిపెట్టే తత్వం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆవును ఇంటిలోకి పంపించి ప్రతి మూల తింపుతారు. ఆ ఇంట్లో దుష్ట శక్తి ఉంటే ఆవు బయపడి భయటకు వస్తుంది. ఒక వేళ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తి లేకుంటే.. ఆవు నిదానం గా ఉంటుంది.
అలాగే ఆవులను దేవతలా పూజిస్తారు. అంతే కాకుండా ఆవులో కోటాను కోట్ల దేవతలు ఉంటారని మన హిందూ సంప్రదాయం ప్రకారం నమ్ముతారు. ఒక ఆవును తీసుకు వస్తే.. భూమి పై ఉన్న హిందూ దేవతలను అందరినీ తమ ఇంట్లోకి తీసుకువచ్చామని నమ్ముతారు. అందుకే ఆవులను నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో తీసుకువస్తారు. అలాగే గోమాతను శుభ సూచికంగా హిందూ ప్రజలు నమ్ముతారు. దైవంగా పూజిస్తారు.
read more.. రాజమౌళితో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్