Home » రాజ‌మౌళితో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్

రాజ‌మౌళితో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్

by Bunty
Ad

గ‌త కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళితో బాలీవుడ్ హీరో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం ఎక్కువ వ‌చ్చింది. ఈ వార్త తెలుగు, హింది న్యూస్ ఛాన‌ల్స్ ల‌లో, మీడియాలో, సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. అలాగే తెలుగు సినీ పరిశ్ర‌మ‌తో పాటు బీ టౌన్ లోనూ ఈ వార్త తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇంతలా ప్ర‌చారం అవుతుందంటే.. సల్మాన్ ఖాన్ తో ఎస్ ఎస్ రాజ‌మౌళి సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ వార్త‌ల పై ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ స్పందించాడు. రాజ‌మౌళి చాలా పెద్ద డైరెక్ట‌ర్ అని అన్నాడు. అత‌ని సినిమా మంచి రికార్డుల‌ను, క‌లెక్ష‌న్లును తీసుకువ‌స్తాయ‌ని అన్నారు.

Advertisement

Advertisement

అలాంటి గ్రెట్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయాల‌ని అంద‌రికీ ఉంటుంద‌ని అన్నారు. త‌న‌కు కూడా రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఉంద‌ని అన్నారు. అలాంటి అవ‌కాశం వ‌స్తే.. త‌ప్ప‌క వినియోగించుకుంటా అని అన్నారు. అయితే ప్ర‌స్తుతం వ‌స్తున్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాజమౌళి తో ఎలాంటి సినిమా తీయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్న భ‌జ‌రంగీ భాయిజాన్ సినిమాకు సీక్వెల్ గా ప‌వ‌న్ పుత్ర భాయిజాన్ ను తీస్తున్నారు. అలాగే టైగ‌ర్ 3 కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే షారుక్ ఖాణ్ తో చేసిన ప‌ఠాన్ సినిమా కూడా విడుద‌లకు సిద్ధం ఉంది.

read more.. కాకుల‌కు అన్నం ఎందుకు పెడుతారో తెలుసా?

Visitors Are Also Reading