అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నటువంటి చిత్రం ‘ఉగ్రం’. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం నాంది సూపర్ హిట్ కావడంతో ఉగ్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని తొలుత మేకర్స్ అనుకున్నారు. తాజాగా మే 05వ తేదీకి వాయిదా వేశారు.
Advertisement
ఈ విషయాన్ని హీరో అల్లరి నరేష్ తెలియజేస్తూ.. ఎన్నో సమ్మర్ నేను మీ హృదయాలను గెలుచుకున్నాను. అయితే ఈ సమ్మర్ లో మీరు నా ఉగ్రరూపం చూడబోతున్నారు” అని పేర్కొన్నాడు. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఉగ్రం చిత్రానికి తూము వెంకట్ కథను అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. సిద్ సినిమాటోగ్రాఫర్ వ్యవహరించారు.
Advertisement
Also Read : నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్
అయితే మే 05న గోపించద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న చిత్రం రామబాణం కూడా విడుదల కాబోతుంది. రామబాణం, ఉగ్రం సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 14 నుంచి మే 05 కి ఎందుకు వాయిదా వేశారో అనేది మాత్రం తెలియడం లేదు. ఏప్రిల్ 14న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదల అవుతుండటం వల్లనే ఉగ్రం వాయిదా వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ వాయిదా వేయడానికి కారణం మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
Also Read : బలగం చిత్రానికి మరో అవార్డు.. మొత్తం ఎన్ని అవార్డులంటే ?