సినిమా ఇండస్ట్రీలో హీరోలు బయట చూడటానికి ఫ్రెండ్లీగా ఉంటారు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఫైట్ చేసుకుంటారు. ఇక ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలని అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడే కాదు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి కూడా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ గా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మోహన్ బాబు కూడా బాక్సాఫీస్ వద్ద యుద్దానికి దిగారు.
ALSO READ : ఆయన మగతనంతో నాకేం సంబంధం…వైరల్ అవుతున్న సురేఖవాణి వీడియో..!
Advertisement
అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మరియు మోహన్ బాబు మధ్య రిలేషన్ షిప్ సోసో గా ఉందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో చిరంజీవి మోహన్ బాబులకు స్టేజి పై మాటల యుద్దం జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్దలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్.
Advertisement
అంతే కాకుండా రీసెంట్ గా మా ఎలక్షన్స్ సమయంలో కూడా ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చింది. ఇక అలాంటి వారిమధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ అంటే ప్రతి మూవీ లవర్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. 1998 సంవత్సరంలో మోహన్ బాబు పవన్ కల్యాణ్ మొదటిసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ ఏడాదిలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా జనవరి 1న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన తరవాత రెండు వారాలకు జనవరి 14న మోహన్ బాబు హీరోగా నటించిన ఖైదీగారు సినిమా విడుదలైంది. కాగా పవన్ సుస్వాగతం సినిమా కంటే మోహన్ బాబు ఖైదీగారు సినిమా వెనకబడింది. ఈ సినిమాను సుస్వాగతం సినిమా డామినేట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా జరిగిన బాక్సాఫీస్ యుద్దంలో పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
ALSO READ : బాహుబలి రేంజ్ లో ‘సూర్య 42’.. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు