Home » ప్రయాణికులకు శుభవార్త.. TSRTC మరో కీలక నిర్ణయం 

ప్రయాణికులకు శుభవార్త.. TSRTC మరో కీలక నిర్ణయం 

by Anji
Ad

ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా బెంగళూరు రూట్ లో 46 సర్వీసులలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని బస్ భవన్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో TSRTC చైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ సంయుక్తంగా డైనమిక్ ప్రైసింగ్ పాలసీ వివరాలను వెల్లడించారు.  

Also Read :  అరుణాచలం మూవీలో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా..?

Advertisement

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు మార్చి 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, హోటళ్లు, ఫ్లైట్ బుకింగ్, రైళ్లు తదితర రిజర్వేషన్ సర్వీసుల్లో ఇప్పటికే డైనమిక్ ధరలను ఉపయోగిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అంటే ప్రయాణికుల సంఖ్య, ట్రాపిక్, డిమాండ్ తదితర పారామితులపై ఆధారపడి టిక్కెట్ ధరలు మారుతూ ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటే.. ఈ విధానంలో టికెట్ ధర సాధారణ ధర కంటే తక్కువగా ఉంటుంది. ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టయితే దీనికి అనుగుణంగా ఛార్జీల్లో మార్పులుంటాయి. 

Advertisement

Also Read :  IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

Manam News

మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అధునాతన డేటా విశ్లేషణ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ లను ఉపయోగిస్తుంది. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఏకైక వ్యూహం ఇతర రాష్ట్రాలలో ధరలను ఆర్టీసీతో పోల్చి చూడడం. “ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణ రోజుల్లో కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పీక్ డేస్ లలో సాధారణంగా టిక్కెట్ ధరలు పెంచుతారు. ప్రైవేటు ఆపరేటర్ లతో పోల్చినప్పుడు సరసమైన బడ్జెట్ స్నేహ పూర్వక ప్రయాణాన్ని అందించేందుకు, ఎక్కువ మందికి చేరుకోవడానికి ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ విధానం వల్ల అసలైన ధర కంటే 20 నుంచి 30 శాతం వరకు అన్ సీజన్ టిక్కెట్ ధరలు తగ్గుతాయి. పీక్ సీజన్లు వరుసగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి”  అని తెలిపారు. 

Also Read :  భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి !

Visitors Are Also Reading