సాధారణ సినిమా విడుదల అయిందంటే చాలు.. థియేటర్ వద్దకు వెళ్లి చూసేవారు కొందరు అయితే.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు మరికొందరు. పెద్ద సినిమాల విషయంలో దాదాపు స్టార్స్ ఉంటారు కాబట్టి చాలా వరకు థియేటర్లలో కోట్లాది రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి. చిన్న సినిమాలు మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీలోకి వస్తుందని తెలియగానే ఓబజ్ క్రియేట్ అవుతుంది. అలా హాస్యనటుడు బ్రహ్మానందం చాలా రోజుల తరువాత నటించిన ఓ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది.
Also Read : పెద్దమ్మతల్లి ఆలయంలో ఆ హీరోతో కలిసి సమంత పూజలు..నెట్టింట వైరల్..!
Advertisement
అసలు విషయానికొస్తే.. బ్రహ్మానందం పేరు చెప్పగనే తెలుగు ప్రేక్షకుల పెదాలపై ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఆయన వయోభారం వల్లనో, ఛాన్స్ లు రాకపోవడం వల్లనో తెలియదు కానీ కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యనే మళ్లీ ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తున్నారు. అలా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా పంచతంత్రం. గత ఏడాది డిసెంబర్ 09 విడుదలైన ఈ చిత్రాన్ని మన బాడీలోని పంచంద్రియాలు జ్ఞాపకాలతో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాలనే పాయింట్ తో తీశారు.
Advertisement
Also Read : RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
ఈ సినిమా కథ బాగుంది. నటీనటులు కూడా బాగానే యాక్ట్ చేశారనే టాక్ తెచ్చుకున్న పంచతంత్రం సినిమా మార్చి 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నదని వెల్లడించారు. ఈ ఓటీటీలో చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ కొత్త సినిమాలను ఏం కొనలేదు. ఇప్పుడు పంచతంత్రం ఓటీటీ రైట్స్ కొన్ని వార్తల్లో నిలిచింది.హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించేవిధంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం బ్రహ్మానందం నటించిన పంచతంత్రం చిత్రాన్ని ఓటీటీలో వీక్షించండి.
Also Read : RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?