Home » రీఛార్జ్ ప్లాన్ లో టెలికాం సంస్థలు 28 రోజుల వ్యాలిడిటినే ఎందుకు ఇస్తాయో తెలుసా…?

రీఛార్జ్ ప్లాన్ లో టెలికాం సంస్థలు 28 రోజుల వ్యాలిడిటినే ఎందుకు ఇస్తాయో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

ప్రస్తుతం ఎన్నో టెలికాం కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది వరకు రీఛార్జ్ చేసుకోవాలంటే పది రూపాయలకు 7 రూపాయల రీఛార్జ్, 20 రూపాయలకు 15 రూపాయలు ఉండే రీఛార్జ్ కార్డులు వచ్చేవి. లేదంటే పోస్ట్ పెయిడ్ వేసుకోవాల్సి వచ్చేది. కానీ నెలవారీ ప్లాన్లు అందుబాటులో ఉండేవి కావు. కానీ జియో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో టెలికం రంగంలో పలు మార్పులు వచ్చాయి. నెలకి రూ.199 రూపాయలతో రీఛార్జి చేస్తే నెలకు 28 రోజుల పాటు ఫ్రీ డేటా మరియు కాల్స్ ఉండే ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇలా జియో మాత్రమే కాకుండా ఎయిర్ టెల్, ఐడియా నెట్వర్క్ లు సైతం 28 రోజుల ప్లాన్ పీరియడ్ ను ఇస్తున్నాయి. నిజానికి నెలకు 30 లేదంటే 31 రోజులు ఉంటాయి. కానీ వ్యాలిడిటి మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. అలా ఉండడానికి కారణం కూడా ఒకటి ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం… టెలికాం కంపెనీలు 28 రోజులు లెక్కన రీఛార్జ్ ప్లాన్ లను ప్రకటించడాన్ని ప్రీ పెయిడ్ నెల అని అంటారు.

Advertisement

Advertisement

ఈ లెక్కన సంవత్సరానికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోల్చినట్లయితే ఏడాదికి 29 రోజులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి 29 రోజులకు మళ్లీ మనం రీచార్జ్ చేయించు కోవాలి. అలా ప్రతి ఏడాది అదనంగా ఒక నెల రీఛార్జి చేయించుకోవాలి కాబట్టి దాంతో టెలికాం సంస్థలకు అధిక లాభాలు వస్తాయి. అలా జియో కంపెనీ ఏడాదికి 6,186 కోట్లు, వీఐ రూ.2,934 కోట్లు, ఎయిర్ టెల్ కు రూ.5,415 కోట్లు సంపాదిస్తున్నాయి.

Also Read: సౌత్ ఇండియాలో కాంట‌వ‌ర్షియ‌ల్ జంట‌ల గురించి తెలుసా..?

Visitors Are Also Reading