Telugu News » సౌత్ ఇండియాలో కాంట‌వ‌ర్షియ‌ల్ జంట‌ల గురించి తెలుసా..?

సౌత్ ఇండియాలో కాంట‌వ‌ర్షియ‌ల్ జంట‌ల గురించి తెలుసా..?

by Bunty

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు, పెళ్లిలు, విడాకులు ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణంగా మారుతున్నాయి. కొంత మంది కొద్ది రోజుల పాటు ల‌వ్ చేసుకొని ఆ త‌రువాత బ్రేక‌ప్.. కొంద‌రూ శ‌త్రువులాగా మారుతున్నారు. కొంద‌రూ విడిపోయాక కూడా మిత్రులుగా ఎవ‌రి దారిన వారుంటున్నారు. ఆయా హీరోలు, హీరోయిన్ల మధ్య ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌స్తూనే ఉన్నాయి. కొంత‌మందివి నిజాలు, కొంత మందివి పుకార్లుంటుంటాయి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కాంట్ర‌వ‌ర్స‌ల్ జంట‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

 

ముఖ్యంగా న‌య‌న‌తార‌, ప్ర‌భుదేవా జంట‌లు అప్ప‌ట్లో సినిమా ప‌రిశ్ర‌మలో వీరి ప్రేమ కొద్ది రోజుల పాటు కొన‌సాగింది. ప్ర‌భుదేవా, న‌య‌న‌తార జంట‌లు పెళ్లి చేసుకోబోతున్నార‌ని టాక్ కూడా వినిపించింది. ఇందుకోసం త‌న మొద‌టి భార్య‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్ర‌భుదేవా. అదేవిధంగా శృతి, ధ‌నుష్ వీరిద్ద‌రు కూడా డేటింగ్ చేసిన‌ట్టు రూమ‌ర్స్ వినిపించాయి. అదే స‌మ‌యంలో కొల‌వెరి కొల‌వెరి సాంగ్ రావ‌డంతో ఇంకాస్తా అనుమానాలు ఎక్కువ‌య్యాయి.

 

శింబు, హ‌న్సికలు కూడా ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు వినిపించాయి. అమ‌లాపాల్, విజ‌య్ ప్రేమ‌లో ఉన్నారు. అయితే అక‌స్మాత్తుగా అమ‌ల వేరే పెళ్లి చేసుకోవ‌డంతో వీరి ప్రేమ‌కు బ్రేకు ప‌డింది. అనిరుధ్ ఆండ్రియా వీరిద్ద‌రికీ సంబంధించిన ఓ ప్రైవేటు ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టేంత వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ఏమైందో ఏమో కానీ వీరు కూడా బ్రేక‌ప్ అయ్యారు. సిమ్రాన్, క‌మ‌ల్ వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని అప్ప‌ట్లోనే రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఏమైందో ఏమో మ‌రీ సిమ్రాన్ సైడ్ అయ్యారు. క‌మ‌ల్ మాత్రం ఇప్ప‌టికీ ఒంట‌రిగానే ఉన్నారు. ప్ర‌భు, కుష్బు వీరిద్ద‌రి రిలేష‌న్ షిప్ చాలా కాలం పాటు న‌డిచింది. ప్ర‌భు కుష్బు జంట కూడా పెళ్లి చేసుకోలేదు. అయితే అంద‌రూ ఈ జంట‌ల గురించి ఏదో ఓ సంద‌ర్భంలో చ‌ర్చించుకుంటూనే ఉన్నారు.

 


You may also like