ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసి కోర్సుల ప్రవేశాలకు ఈ ఏపీసేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25% వెయిటేజ్ ఇచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈఏపీసెట్ పరీక్షకు ఇంటర్ వెయిటేజ్ ను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి యధాతధంగా 25 శాతం ఇవ్వనున్నట్లు తాజాగా అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ ఏడాది ఈఎపీసెట్ పరీక్షకు హాజరయ్యేవారు గతేడాది ఫస్టియర్ పరీక్షకు హాజరయ్యారు. అదే విధంగా ఈ ఏడాది సెకండ్ ఇయర్ పరీక్షలకు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోని అధికారులు వెయిటేజ్ ను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఏడాది ఈఏపీసేట్ షెడ్యూల్ విషయానికొస్తే, మే 15 నుంచి 25 వరకు ఎంపీసీ విభాగం ఎగ్జామ్స్ ను, మే 23 నుంచి 25 వరకు బైపిసి విభాగంలో పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఎగ్జామ్స్ ను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహిస్తారు.