Home » చైతూతో ఉన్న ఆ ఒక్క తీపి గుర్తును కూడా చెరిపి వేసిన సమంత !

చైతూతో ఉన్న ఆ ఒక్క తీపి గుర్తును కూడా చెరిపి వేసిన సమంత !

by Bunty
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన సమంత అక్కినేని వారి హీరో నాగార్జున తనయుడు నాగచైతన్యను ప్రేమించి, కొన్నేళ్ల తర్వాత వివాహం ద్వారా ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన మొదటి మూవీ ఏ మాయ చేసావే. తొలిచూపులోనే ప్రేమలో పడ్డ వీరు కొద్దిరోజులు ఎవరికి తెలియకుండా రహస్య ప్రేమాయణం నడిపించారు. చివరికి ఇద్దరు ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. కానీ సమంత, నాగచైతన్య కొన్ని అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు.

Advertisement

ప్రస్తుతం వారు ఎవరి జీవితం వారు సంతోషంగా గడిపేస్తున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య కన్నా సమంత ఎంతో హైలెట్ అయిందని చెప్పాలి. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తనకు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు అవుతున్న దగ్గర ఉండకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను కూడా డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఇక తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఎలాంటి వస్తువులు తన దగ్గర ఉండకూడదని భావించిన సమంత అతను ఇచ్చిన వస్తువులను కూడా తిరిగి వెనక్కి పంపించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. సమంత, నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసింది. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న పెళ్లి చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం విశేషం. ఆ చీరను కూడా సమంత పంపించేసిందట.

READ ALSO : కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

Visitors Are Also Reading