మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశారు. చిరు హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా డాడీ సినిమా. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా ఆయన కు కూతురు గా ముఖ్యమైన పాత్రలో నటించిన చిన్నారి తన నటన తో ఆకట్టుకుంది.
Also Read: Niharika:నిహారిక ప్రెగ్నెంటా.. అందుకే అలా చేస్తోందా..?
Advertisement
ఆ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా….కాగా సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తో పాటు బాలీవుడ్ లో కూడా అనుష్క ఓ సినిమా చేసింది. అయితే టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలను అందుకుంది. కానీ ఆ తరవాత అనుష్క సినిమాలకు దూరంగా ఉండి చదువుల పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆ పాప ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉంది.
Also Read: ఆహాలో 18 పేజెస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?
Advertisement
అంతే కాకుండా హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోని అందం తో కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అనుష్క కు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ లు వస్తున్నాయి. కానీ లండన్ లో చదువు పూర్తి చేసి అక్కడే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. నిజానికి అనుష్క తన పాషన్ ను ఫాలో అవుతోంది. ఒకప్పుడు ఇంట్లో వాళ్ల కోసం సినిమాల్లో నటించింది.
కానీ ఇప్పుడు ఉద్యోగం చేయడానికే ఇష్టపడుతుంది. లేదంటే సినిమాల్లో ఎప్పుడూ ఛాన్స్ లు ఉంటాయో ఎప్పుడు ఊడతాయో తెలియదు కాబట్టి ఉద్యోగం చేయడానికే ఇష్టపడుతుందేమో. ఇదిలా ఉంటే చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించి ప్రస్తుతం హీరో హీరోయిన్ లుగా రాణిస్తున్నారు. నిత్యా మీనన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీ లు కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులే.
Also Read: ఆర్ఆర్ఆర్ లో ‘నాటు నాటు’ పాట షూటింగ్ చేసిన ఈ ప్యాలెస్ గురించి మీకు తెలుసా ?