Home » Niharika:నిహారిక ప్రెగ్నెంటా.. అందుకే అలా చేస్తోందా..?

Niharika:నిహారిక ప్రెగ్నెంటా.. అందుకే అలా చేస్తోందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో నాగబాబు కూతురు నిహారిక అంటే కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికే పలు బుల్లితెర, షోలతో పాటుగా హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక గత కొంతకాలంగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:త్వరలో హీరో శర్వానంద్ పెళ్లి…అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

కొణిదెల నిహారిక పలు సినిమాల్లో నటించిన కానీ అంతగా స్టార్ హోదా దక్కలేదు. దీంతో తన తండ్రి ఆదేశాల మేరకు జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. 2020 డిసెంబర్ లో ఉదయపూర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టి నిహారిక నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా నిహారిక గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటయ్యా అంటే నిహారిక త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ నిహారిక ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

దీనికి ప్రధాన కారణం ఎప్పుడు కూడా అభిమానులతో తన విషయాలను పంచుకునే నిహారిక సోషల్ మీడియాలో తను చివరిగా డిసెంబర్ 12న పోస్ట్ పెట్టింది. ఇక అప్పటినుంచి తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఎలాంటి పోస్టింగులు పెట్టడం లేదు. ఈ సందర్భంలోనే నిహారిక ప్రెగ్నెంట్ అంటూ, అందుకే సోషల్ మీడియాలో కనిపించడం లేదు అంటూ, రెస్ట్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలి అంటే నిహారిక క్లారిటీ ఇవ్వాల్సిందే.

also read:

Visitors Are Also Reading