Home » ఆహాలో 18 పేజెస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

ఆహాలో 18 పేజెస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో యంగ్ హీరో నిఖిల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన కథ, కథనం చూసి సినిమాలు ఒప్పుకోవడం. 2022 లో వచ్చిన కార్తికేయ 2 చిత్రం సూపర్ హిట్ అవడంతోనే, మళ్లీ 18 పేజెస్ మూవీతో థియేటర్లోకి వచ్చి ఘణ విజయం సాధించాడు.. వైవిద్య భరితమైన కథతో వచ్చిన 18 పేజెస్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ వహించారు.

Advertisement

సుకుమార్ కథను అందించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా గోపి సుందర్ సంగీతాన్ని అందజేశారు. డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. స్టార్ హీరో రవితేజ ధమాకా మూవీ పోటీగా ఉన్నప్పటికీ సున్నితమైన ప్రేమకథాంశంతో అత్యధిక వసూళ్లను రాబట్టిందని చెప్పవచ్చు. ఇందులో హీరో, హీరోయిన్ ప్రత్యక్షంగా ప్రేమించుకోవాలి.

Advertisement

అరగంటకు ఒకసారి డ్యూ*ట్స్ పాడుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఈ కంటెంట్ పూర్తిగా భిన్నంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ సోషల్ మీడియాలో రన్ అవుతోంది. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

also read:విజయ్ దేవరకొండ సమంత కండిషన్స్.. కారణం అదేనా.!

Visitors Are Also Reading