Home » ప్రేమిస్తే హీరో భరత్ లవ్ స్టొరీ గురించి మీకు తెలుసా ?

ప్రేమిస్తే హీరో భరత్ లవ్ స్టొరీ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

బాయ్స్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో భరత్. అయితే కేవలం తమిళ హీరో అయినా భరత్ ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తమిళ డబ్బింగ్ సినిమా ‘ప్రేమ చదరంగం’ తో విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు భరత్ అనగానే ప్రేమిస్తే.. సినిమా ఎంత గుర్తోస్తుందో అలానే మల్లీశ్వరివే అనే పాట అంతే గుర్తుకొస్తుంది.  చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత భరత్ మళ్లీ తెలుగులో మహేష్ బాబు స్పైడర్ సినిమాలో కనిపించారు. అయితే మరోసారి హంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న భరత్ ఈ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Advertisement

ప్రేమిస్తే భరత్ సినిమాలలో హీరోగాను విలన్ గాను అదేవిధంగా విలక్షణటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కథ నచ్చితే చాలు అతను నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ రోల్ అయినా సహాయక పాత్ర అయినా చేయాలని భావిస్తుంటాడు భరత్. కాజా గా ఓ ఇంటర్వ్యూలో భారత్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తన ఫ్యామిలీ అదేవిధంగా ఫ్రెండ్స్ తన స్త్రెంత్ అంటూ చెప్పుకొచ్చారు. తనది ప్రేమ, పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అంటూ వివరించారు. ప్రేమించిన తర్వాత ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తొలుత ఎవరు ప్రపోజ్ చేశారనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఎవ్వరూ చేసుకోలేదు ఇద్దరికీ అలా తెలిసిపోయిందని చెప్పారు.

Advertisement

Also Read :  పవన్ పై పోటీకి సిద్ధమన్న ఆలీ.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

అయితే తన భార్య ఓ డాక్టర్ అని వెల్లడించారు. భరత్ కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలు. పిల్లలతో ఆడుకోవడం వల్ల తన వర్క్ ప్రెషరు టెన్షను అన్ని పోతాయి అని చెప్పుకొచ్చాడు భరత్. తన భార్య తన సినిమా చూసి న్యూట్రల్ గా ఫీడ్బ్యాక్ ఇస్తుందని.. కానీ తన సోదరి మాత్రం మంచి కృతిక అంటూ చెప్పుకొచ్చారు. తాను సినిమాలో నా క్యారెక్టర్ బాగా లేకపోయినా నేను సరిగ్గా చేయకపోయినా వెంటనే మొహం మీదనే చెప్పేస్తుంది అని ఫ్యామిలీ గురించి తెలిపారు భరత్.

Also Read :  టాలీవుడ్ హీరో కూతురుతో వరుణ్ తేజ్ పెళ్లి, అంతా సెట్ చేస్తున్న నాగబాబు?

Visitors Are Also Reading