మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ జోనర్ ఎంటర్టైనర్స్ లో నటించడానికి ఇష్టపడేవాడు. రకరకాల స్క్రిప్స్ ను ఎంచుకుని, విభిన్నమైన కథలు ఎంచుకొని తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరచుకోవడమే కాకుండా ఒక మంచి నటుడిగా కూడా తన సత్తాను చాటుకున్నాడు. వరుణ్ తేజ్ యాక్షన్ కథలు మాత్రమే కాకుండా ఎఫ్2 వంటి సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశాడు.
Advertisement
READ ALSO : Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!
Advertisement
అతను ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన మరియు ఉత్తేజ కరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ మీద రీసెంట్ గా ఓ రూమర్ వచ్చింది. ఆయన లావణ్య త్రిపాఠి తో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు కూడా వరుణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే వరుణ్ తేజ్ కు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడంట నాగబాబు.
ఇందుకోసం ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సంబంధాలను లైన్ లో పెడుతున్నాడంట. అయితే తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే దగ్గుబాటి కుటుంబంతో వియ్యం అందుకోవాలని నాగబాబు ఆశిస్తున్నాడంట. ఇందులో భాగంగానే వెంకటేష్ చిన్న కూతురు హయావాహినితో వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని అనుకుంటున్నాడంట. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Advertisement
read also : VASTHU TIPS : మహిళలు ఈ పనులు చేస్తే ఇంట్లో అష్ట దరిద్రమే, అర్జెంటుగా మానుకోండి!