జీడి పప్పు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ అనుకుంటారు. ఇందులో మెగ్నీషియం పొటాషియం, కాపర్,జింక్,ఐరన్,మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పులో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పు కు దూరంగా ఉంటే మంచిదని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీకడుపుతో జీడిపప్పు ఎక్కువగా తింటే జీడిపప్పు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇంతకీ ఏ అనారోగ్యంతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు?జీడిపప్పు తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసుకుందాం.
Advertisement
రక్తపోటు:హెవీ బ్లడ్ ప్రెషర్
జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మీరు ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో సోడియం స్థాయిని పెరుగుతాయి అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు సోడియం స్థాయిలను పెరగడం వల్ల..రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
Advertisement
ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు :
జీడిపప్పు లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖాళీ కడుపుతో జీడిపప్పు తినడం వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణం పెరుగుతుంది.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు:
పొటాషియం లో జీడిపప్పు దుష్ప్రభావాలు ఉన్నాయి.దీంతో ఎసిడిటీ గ్యాస్ సమస్యలు రావచ్చు. అందువల్ల మీకు కిడ్నీ సమస్యలు ఉంటే శరీరంలో పొటాషియం స్థాయిలను పెంచడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణంగా రోజుకు నాలుగు నుంచి ఐదు తినవచ్చు.కానీ మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే నిపుణుల సలహా మేరకు జీడిపప్పు తీసుకోవడం చాలా మంచిది.
ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణంగా రోజుకు నాలుగు నుంచి ఐదు పప్పులను తినవచ్చు.