Home » APPSC Group-2 : ‘గ్రూప్-2’ పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు – పూర్తి వివరాలు ఇవే!

APPSC Group-2 : ‘గ్రూప్-2’ పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు – పూర్తి వివరాలు ఇవే!

by Bunty
Ad

ఆంధ్ర ప్రదేశ్‌ లోని నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. గ్రూప్-2 సిలబస్ పరీక్ష పేపర్లలో మార్పులు చేస్తూ జగన్‌ సర్కార్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై స్క్రీనింగ్ టెస్ట్ 150, మెయిన్ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్ట్ ను 150 ప్రధాన పరీక్షను మూడు పేపర్లతో నిర్వహించారు. మొత్తం 450 మార్కులు ఉండేవి. ఆర్థిక శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పరీక్షా, సబ్జెక్టులు మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

* స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ-150

* మెయిన్స్ పేపర్-1 ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం-150

Advertisement

* పేపర్-2:ఆంధ్రప్రదేశ్, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్ అండ్ టెక్నాలజీ-150

గ్రూప్-1 కు మరో 19 పోస్టులు

గ్రూప్-1 (28/2022) నోటిఫికేషన్ లో పేర్కొన్న 92 పోస్టులకు ఆదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 27/2018 నోటిఫికేషన్ అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనందున మిగిలిన 17 పోస్టులు, భర్తీ కానీ మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిఫికేషన్ (28/2022)కు కలిపినట్లు వెల్లడించింది.

READ ALSO : అనాధలాగా కృష్ణ మృతదేహం…నరేష్ చేసిన పనికి విజయనిర్మల ఆత్మ ఎంత బాధపడిందో – రమ్య రఘుపతి

Visitors Are Also Reading