Home » ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పుజారాకు ఎందుకు..? శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వొచ్చు కదా..!

‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పుజారాకు ఎందుకు..? శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వొచ్చు కదా..!

by Anji
Ad

బంగ్లాదేశ్ తో టీమిండియా రెండు టెస్ట్ సిరీస్ పోరు ముగిసిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా పుజారాని ఎంపిక చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సగటు 74తో పుజారా 222 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. కానీ ఇవి రెండు తొలి మ్యాచ్ లో సాధించినవే. రెండో టెస్ట్ లో అతని స్కోర్లు వరుసగా 24, 06. అయితే ఈ మ్యాచ్ లో అతను పూర్తిగా విఫలం చెందాడనే చెప్పవచ్చు. 

Advertisement

 

జట్టును ఆదుకోవాల్సింది పోయి వికెట్ కోల్పోయి జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎలా ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ముఖ్యంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 202 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ సగటు 101. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అతను ఆదుకున్నాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులతో జట్టుకు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Manam News

రెండో టెస్ట్ లో కూడా 87, 29(నాటౌట్)గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టుకు ఆధిక్యం అందేవిధంగా చూశాడు. ఛేదనలో ఓవైపు ఓటమి భయం వెంటాడుతున్నప్పటికీ తడబడకుండా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రశాంతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ ని కాదని పుజారాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా  దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేయడం విశేషం. 

Also Read :  ఉత్కంఠ బరితంగా సాగిన రెండో టెస్ట్ లో టీమిండియా గెలుపు..ప్రపంచ రికార్డు నమోదు..!

Visitors Are Also Reading