కాలం మారింది. మనుషుల మనస్తత్వాలు కూడా మారుతున్నాయి.. చిన్న చిన్న విషయాలకి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనలు రోజు రోజుకు కోకొల్లలు వస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా ఆలోచిస్తూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అలాంటి ఓ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. తల్లిని కాదన్న బిడ్డలు ఉన్నారు కానీ బిడ్డను కాదన్న తల్లులు లేరని చెప్పవచ్చు.. కానీ ఇక్కడ అంత రివర్స్ ఉంది .
Advertisement
Also read;మగవారి కంటే ఆడవారికి చలి ఎక్కువగా పెడుతుంది.. కారణం..?
చిత్తూరు జిల్లాకు చెందిన గీతా వయసు 16 సంవత్సరాలు. చిన్నారి తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం విడిపోయారు. దీంతో అమ్మాయి తమిళనాడులోని తన అమ్మమ్మ వద్దకు చేరింది. ఇక విడాకులు అయ్యాక గీతా తండ్రి పావని అస్సలు పట్టించుకోలేదు. ఆస్తి కోసం భరణం కోసం పాప బాధ్యత తీసుకున్న తల్లి కూడా తన సుఖం తానే చూసుకుంటూ కూతురును పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ఈ విధంగా తల్లిదండ్రుల అలనా పాలనా తెలియని అమ్మాయి పూర్తిగా అమ్మమ్మ వారింట్లో అల్లరి చిల్లరగా పెరిగింది. కనీసం పదవ తరగతి కూడా పాస్ కాలేకపోయింది. దీంతో ఇంటివద్దే ఖాళీగా ఉంటున్న గీత ఈమధ్య చిత్తూరులోని తన మేనత్త ఇంటికి వెళ్ళింది.
Advertisement
మళ్లీ అక్కడ నుంచి తన అమ్మ వద్దకు వెళ్లాలనుకుంది గీత. కానీ తన కసాయి తల్లి అందుకు అంగీకరించకపోవడంతో పాటు నీ బాధ్యత నేను చూసుకోలేను అని డైరెక్ట్ గా చెప్పిందట. కానీ గీత మాత్రం అమ్మ నీతో నాకు ఉండాలని ఉంది అని వేడుకున్నా కానీ తల్లి హృదయం కరగలేదు. ఆమె నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఈ విధంగా తండ్రి లేడు తల్లి కూడా దూరం ఎంతో మనోవేదనకు గురయింది గీత. ఈ తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.ఈ విధంగా తల్లిదండ్రులకు భారమైన ఈ అమ్మాయి 16 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Also read;ఈ అలవాట్లు ఉంటే, బెడ్ రూంలో వీక్ అయిపోతారు !