Home » భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించండి…!

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించండి…!

by AJAY
Ad

భార్య భ‌ర్తల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం చాలా కామ‌న్. సంసారం అన్న త‌ర‌వాత గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే చిన్న‌చిన్న గొడ‌వ‌లు జ‌రిగితే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండవు కానీ ఆ గొడ‌వ‌లు పెద్ద‌గా మారితే మాత్రం ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మే. గొడ‌వ‌లు పెరిగితే భార్య భ‌ర్త‌ల మ‌ధ్య దూరం కూడా పెరుగుతుంది. ఆ త‌ర‌వాత వారిని ఎంత క‌ల‌పాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగినా అది కుద‌ర‌క‌పోవ‌చ్చు.

Advertisement

అంతే కాకుండా కొన్ని సార్లు ఆ గొడ‌వ‌లు ఇద్ద‌రూ విడిపోయే వర‌కూ కూడా దారి తీయ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఇద్ద‌రి మధ్య గొడ‌వ‌లు జ‌రకుండా ఉండాలంటే కొన్నిచిట్కాలు పాటించాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం… కామ‌న్ గా భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. అయితే అలా గొడ‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు త‌గ్గ‌డం వ‌ల్ల ఆ గొడ‌వ‌కి అక్క‌డే పులిస్టాప్ ప‌డుతుంది.

Advertisement

కాబ‌ట్టి త‌గ్గ‌డం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు దాన్ని మ‌రుస‌టి రోజు మర్చిపోతే మంచిది..సాగ‌దీస్తే మ‌నస్ప‌ర్ద‌లు పెరిగే అవ‌కాశం ఉంది. కాబట్టి ఈ రోజు గొడ‌వ జ‌రిగిందంటే మ‌ళ్లీ మ‌రుస‌టి రోజు అస‌లేం జ‌ర‌గ‌న‌ట్టు ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం..క‌లిసి పోవ‌డం చేయాల‌ట‌. అంతే కాకుండా భార్యా భ‌ర్త‌ల‌కు స్వారీ చెప్పుకునే గుణం ఖ‌చ్చితంగా ఉండాలంట‌.

గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు ఒక్క‌రు కాకుండా ఇద్ద‌రూ కూడా అలా చేసినందుకు స్వారీ అని చెప్పుకుంటే ఎలాంటి స‌మస్య‌లు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా గొడ‌వ‌లు రావ‌డానికి కార‌ణం కోపం. అయితే కోపం త‌గ్గించుకోవడం వ‌ల్ల గొడ‌వ‌లు జ‌ర‌గ‌వు. కాబట్టి ముందుగా భార్య భ‌ర్త‌ల్లో ఎవ‌రికి ఎక్కువ‌గా కోపం ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

ALSO READ:  హీరోయిన్ ధన్య బాలకృష్ణ నిజ స్వరూపం బట్టబయలు..పెళ్ళైన డైరెక్టర్ తో సీక్రెట్ గా ఆ పనులు !

Visitors Are Also Reading