రాజ్యసభలో ది ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు 2022’ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే లోక్‌సభలో ది ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
నాలుగవరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.. షెడ్యూల్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు ను రాజ్యసభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా..ఇప్పటికే లోక్ సభలో షెడ్యూల్ కులాల రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
Advertisement
తుఫాను, భారీ వర్షాలపై క్యాంపు ఆఫీసులో ఉదయం 11:30గంటలకు సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం జరగనుంది. సంబంధిత శాఖల అధికారులు హాజరు కానున్నారు.
అమరావతి గుడివాడలో పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పర్యటించనున్నారు. అకాల మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేతాజీ భౌతికకాయాన్ని సందర్శించనున్న గిడుగు.. ఆయన వెంట పలువురు పీసీసీ నేతలు వెళ్లనున్నారు.
Advertisement
సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టనుంది.
గుజరాత్ సీఎంగా రెండో సారి భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంధీనగర్ హెలిప్యాడ్ మైదనంలో మధ్యాహ్నం 2 గం.లకు ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ ఆచార్య దేవరాత్. అమిత్ షా…బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. సంగం.నెల్లూరు బ్యారేజ్ ల నుంచి నీటి విడుదలతో స్వర్ణముఖి..కాలంగి..కైవల్య నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. పంబా వరకు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సరైన ఏర్పాట్లు చేయడం లేదంటూ భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 91 కింద నోటీసులు సీబీఐ నోటీసులు ఇచ్చింది. త్వరలో విచారణ తేదీని సీబీఐ ప్రకటించనున్నారు.