Home » ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోన్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోన్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

by Anji
Ad

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు నష్టాలను మిగిల్చుతుంటే..  తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇక అందులో రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి మంచి లాభాలు సంపాదించుకుంటున్నాయి. అందుకు ఉదాహరణ కాంతారా, కార్తికేయ 2 వంటి సినిమాలుగా చెప్పవచ్చు. తాజాగా మరో సినిమా కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది. ఆ చిత్రమే మసూద.

Advertisement

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మళ్లీరావా, థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రినివాస ఆత్రేయ వంటి విభిన్న కథలతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాశ్, సత్యం రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.  నవంబర్ 18న మసూద ప్రపంచ వ్యాప్తంగా విడుదలై  మంచి విజయాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.  

Advertisement

Also Read :  సీరియల్స్ లో యాక్టింగ్ మానేయడానికి అసలు కారణం వెల్లడించిన అస్మిత..!

Masooda Movie :  Manam News

ఈ చిత్రంలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గుర్తుండే ఉంటుంది. ఈమె అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది కావ్య. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మసూద చిత్రాన్ని ఆహా భారీ ధరకే కొనుగోలు చేసిందని.. డిసెంబర్ 16న లేదా 23న స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 16 ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 సినిమా థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజు మసూద చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. 

Also Read :  నటిగా సినిమాల్లోకి సింగర్ సునీత….ఆ స్టార్ హీరోకు అక్కగా గోల్డెన్ ఛాన్స్…?

Visitors Are Also Reading