Home » సీరియల్స్ లో యాక్టింగ్ మానేయడానికి అసలు కారణం వెల్లడించిన అస్మిత..!

సీరియల్స్ లో యాక్టింగ్ మానేయడానికి అసలు కారణం వెల్లడించిన అస్మిత..!

by Anji
Ad

ఈటీవీలో ప్రసారమయ్యే పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిన మారిన అశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా కనిపించింది. ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మాటీవీలో ప్రసారం అయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరఅయింది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ ఉన్న అస్మిత పెళ్లి తరువాత యాక్టింగ్ కి దూరంగా ఉంటుంది. సీరియల్స్ లో ఇక నటించకూడదని ఎందుకు అనుకుంటుందో అందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

Advertisement

అస్మిత సీరియల్స్ లో చాలా వరకు సాప్ట్ హీరోయిన్ రోల్స్ మాత్రమే చేశారు. ఇక తనకు మాత్రం ఎప్పుడు ఏడిచే పాత్రలు కాకుండా ఏడిపించే పాత్ర చేయాలని ఉండేదట. అలా అగ్నిసాక్షి సీరియల్ లో విలన్ గా  చేసిన అస్మిత అందులోతన నటనతో ఆకట్టుకుంది. ఆ సీరియల్ తరువాత కూాడా ఎన్నో అవకాశాలు వచ్చిన ఇక సీరియల్స్ గుడ్ బై చెప్పేసింది. తన డ్రీమ్ రోల్ అంటే అగ్నిసాక్షి సీరియల్ లో చేసింది అంటూ చెబుతున్న అస్మిత నా డ్రీమ్ రోల్ కూడా చేసేశాను. అందుకే సీరియల్స్ కి గుడ్ బై చెప్పేశాను అని వెల్లడించింది.  

Advertisement

Also Read :  తమ్ముడు మూవీలో లవ్లీ గా చేసిన హీరోయిన్.. మరీ ఇలా తయారైందేంటి..?

అదేవిధంగా తాను తొలుత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ వేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. సీరియల్స్ లో ఆ తేడా చాలా ఎక్కువగా ఉంది. పాత సీరియల్స్ లో ఒక క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెబితే చివరి వరకు అలాగే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. పూటకొకసారి మార్పు వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు అంటూ కథను ఏదో చేసేస్తున్నారు. అందుకోసమే ఇక సీరియల్స్ లో నటించకూడదని తాను భావించాను. తనకు ఎలాంటి రెగ్రేట్స్ లేవని చెప్పుకొచ్చారు అస్మిత. 

Also Read :   కేజీఎఫ్ ఫేమ్ కృష్ణాజీరావు ఇకలేరు..!

Visitors Are Also Reading