పలువురు ముద్దగుమ్మలు సౌత్ లో టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. తమ అందం, అభినయంతో జనాల మనసులు దోచుకుంటున్నారు. సినీ కెరీర్ పరంగా మంచి ఊపులో కొనసాగుతున్నా.. వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా కష్టాలతో నిండుకుని ఉన్నది. కొందరూ ప్రేమ విఫలమై బాధపడితే.. మరికొందరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటై విడిపోయారు కూడా. పర్సనల్ లైఫ్ బాధలను మర్చిపోయేలా ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
స్టార్ హీరోయిన్ సమంత తెలుగు, తమిళం, మలయాళం సినిమా పరిశ్రమలో మంచి హీరోయిన్గా కొనసాగుతొంది. పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే తన భర్త నాగచైతన్య మంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు తీస్తూ తనపెళ్లి బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. శాకుంతలం సినిమాను కంప్లీట్ చేసుకుంది. విజయ్ సేతుపతితో కాత్తువాక్కుల రెండు కాదల్‌లో కూడా నటిస్తోంది. అటు డ్రీమ్ వారియర్ పిక్షర్ 30వ మూవీ కూడా ఓకే చెప్పింది. అటు ఓ హాలీవుడ్ సినిమాను కూడా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Advertisement
Advertisement
ఇక ఈ అమ్ముడికి బోలెడన్నీ ప్రేమకథలున్నాయి. మొదల శింబుతో ప్రేమాయణం కొనసాగించిన ఈ అమ్ముడు. ఆయనతో బ్రేకప్ అయ్యాక మరిన్ని ఆఫర్లు అందుకుంది. పలు సినిమాలలో నటించింది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించింది. తనను పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయనతో కూడా రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యింది. ఆ తరువాత ఈమెకు ఇంకా ఎక్కువ ఆపర్లు వచ్చాయి. లేడి ఓరియెంటెడ్ సినిమాలో సౌత్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది.
అదేవిధంగా ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకెళ్లుతుంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో నటులు, నిర్మాత అయిన రక్షిత శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఆ తరువాత అది రద్దయింది. అటు తరువాత తెలుగులో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.