దర్శకుడు వక్కంతం వంశీ తాజాగా ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టెంపర్ సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మరిచిపోలేదని.. అదేవిధంగా ఆ సినిమా కథ విని పూరి ఇచ్చిన రియాక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. రైటర్ గా దర్శకుడుగా ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఈయన తన కెరీర్ స్టార్టింగ్ లో సురేందర్ రెడ్డి సినిమాలకు కథలు అందించేవారు.
Advertisement
అదేవిధంగా హీరోగా కూడా ఓ చిత్రంలో నటించారు. ఆ తరువాత దర్శకత్వం మీద ఆసక్తితో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇటువైపు అడుగులు వేశారు. “టెంపర్ చిత్రం కోసం మొదటగా నేను ఎన్టీఆర్ కి చెప్పాను. ఆయన పూరి గారికి ఎక్స్ ప్లెయిన్ చేయమన్నారు. ఆయనకు కథ చెప్పాలంటే నాకు కొంచెం భయమేసింది. ఆ సమయంలో పూరిగారికి నాకు మధ్య క్లైమాక్స్ విషయంలో జరిగిన డిస్కషన్ నాకెందుకో నచ్చలేదు.
Advertisement
Also Read : ఈగో సమస్య వల్ల చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయో తెలుసా..?
క్లైమాక్స్ నాకు నచ్చలేదని ఆయనకి డైరెక్ట్ గా చెప్పలేకపోయాను. నాకు ఒక గంట సమయం ఇవ్వండి మళ్లీ వచ్చి ఆయనకు క్లైమాక్స్ చెప్పగా.. ఒక్కసారిగా లేచి నన్ను హగ్ చేసుకున్నారు అలాగే ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆ తరువాత అందరం భోజనానికి కూర్చున్నాం. పూరి ఉన్నట్టుండి భోజనం ప్లేట్ పక్కకు నెట్టేశారు. నాకు ఆకలిగా లేదు నువ్వు చెప్పిన స్టోరీతోనే నా కడుపు నిండిపోయింది అన్నారు. ఈ అనుభవం నా జీవితంలో మరిచిపోలేనిది” అంటూ చెప్పుకొచ్చారు వంశీ. అల్లు అర్జున్ కి తన కథల్లో రెండు కథలు అంటే చాలా ఇష్టం. ఊసరవెల్లి, కిక్ 2 ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన మేర ఆడలేదు. ఊసరవెల్లి సినిమాని రీమెక్ చేస్తే తాను చేస్తానని అల్లు అర్జున్ చాలా సార్లు చెప్పుకొచ్చినట్టు వంశీ తెలిపారు.
Also Read : వాళ్ళందరి వెంటపడి చివరికి నా దగ్గరకు వచ్చాడు.. చైతూ పై సమంత కామెంట్స్ వైరల్…!