Telugu News » Blog » ఈగో స‌మ‌స్య వ‌ల్ల చిరంజీవి శ్రీదేవి కాంబినేష‌న్ లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయో తెలుసా..?

ఈగో స‌మ‌స్య వ‌ల్ల చిరంజీవి శ్రీదేవి కాంబినేష‌న్ లో ఎన్ని సినిమాలు ఆగిపోయాయో తెలుసా..?

by AJAY
Ads

సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి శ్రీదేవిల‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగితే శ్రీదేవి అతిలోక సుంధ‌రిగా పేరు సంపాదించుకుంది. వీరిద్ద‌రూ ఎంతో స‌క్సెస్ అయ్యారు. చిరు టాలీవుడ్ కు మెగాస్టార్ అయితే శ్రీదేవి బాలీవుడ్ లో సైతం సినిమాలు చేసింది. అలాంటి వీరిద్దరి కాంబినేష‌న్ లోనూ సినిమాలు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి.

Advertisement

అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్ ను సెట్ చేయ‌డం అంటే అంత ఈజీకాదు. శ్రీదేవి అప్ప‌టి స్టార్స్ ఎన్టీఆర్, ఏఆన్ఆర్ ల‌తోనూ సినిమాలు చేసేది. అదే విధంగా బాలీవుడ్ లోనూ బిజీగా ఉండేది. అయితే బాలీవుడ్ లో బిజీగా మారిన త‌ర‌వాత శ్రీదేవి టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించ‌లేదు. అంతే కాకుండా శ్రీదేవి బాలీవుడ్ లో అడుగుపెట్టాక కాస్త ఈగో స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చాయని అప్ప‌టి నటీన‌టులు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతుంటారు.

Advertisement

Chiranjeevi Sridevi

Chiranjeevi Sridevi

కొంద‌రు దాన్ని ఈగో అంటే మ‌రికొంద‌రు స‌మాన‌త్వం కోరునేది అని చెబుతుంటారు. ఇక చిరంజీవితోనూ ఓ సినిమా విష‌యంలో శ్రీదేవికి ఈగో స‌మ‌స్య వ‌చ్చింద‌ట‌. శ్రీదేవి సొంతంగా శ్రీల‌త బ్యాన‌ర్ అనే పేరుతో నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసి సినిమాల‌ను నిర్మించ‌డం మొద‌ల‌పెట్టారు. ఈ క్ర‌మంలో చిరంజీవి హీరోగా సొంత బ్యాన‌ర్ లో శ్రీదేవి ఓ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకు కోదండ‌రామిరెడ్డిని ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు. ఎండ‌మూరి వీరేంద్ర‌నాథ్ క‌థను అందించాల్సి ఉండ‌గా ఆయ‌న ఏకంగా 20 క‌థ‌ల‌ను సిద్దం చేశారు.

Advertisement

అయితే క‌థ‌ల‌లో ఒక‌దాంట్లో హీరోయిన్ డామినేట్ చేస్తే మ‌రో సినిమాలో హీరో డామినేష‌న్ ఉండేది. దాంతో శ్రీదేవి ఏ క‌థ‌ను కూడా ఫైన‌ల్ చేయ‌లేదు. ఆ సినిమా ఆగిపోయింది. ఇక చివ‌రికి వ‌జ్రాల‌దొంగ పేరుతో చిరంజీవి, శ్రీదేవి హీరోయిన్ లుగా ఓ సినిమా టైటిల్ ను అన్సౌన్స్ చేశారు. సినిమా క‌థ‌ను అనుకున్న‌ప్ప‌టికీ ఆ సినిమాలో హీరో పాత్ర హీరోయిన్ పాత్ర‌ను డామినేట్ చేయ‌కూడ‌ద‌ని శ్రీదేవి మార్పులు చేయాలని చెప్పార‌ట‌. దాంతో సినిమాలో రాధ‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.