Home » డిసెంబ‌ర్ 31 లోగా ఈ ప‌నులు త‌ప్ప‌ని స‌రిగా పూర్తిచేయాలి… లేదంటే…

డిసెంబ‌ర్ 31 లోగా ఈ ప‌నులు త‌ప్ప‌ని స‌రిగా పూర్తిచేయాలి… లేదంటే…

by Bunty
Ad

మ‌నం చాలా ప‌నుల‌ను చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి పెండింగ్‌లో పెడుతుంటారు. పెండింగ్‌లో పెట్టిన ప‌నుల‌ను ఆ త‌రువాత మ‌ర్చిపోయి ఇబ్బందులు ప‌డుతుంటారు. అలా మ‌ర్చిపోయి, తీరిక లేకుండా ప‌క్క‌న పెడుతున్న కొన్ని ప‌నుల‌ను వెంట‌నే డిసెంబ‌ర్ 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొద‌టిప‌ని ఈపీఎఫ్ఓ ఖాతాకు నామినీని జ‌త చేయ‌డం. ఈ ప‌నిని డిసెంబ‌ర్ 31 లోగా పూర్తి చేయాలి. ఈపీఎప్ఓ ఖాతాకు నామినీని త‌ప్ప‌ని స‌రిగా జ‌త‌చేయాలి. ఖాతాకు నామినీని జ‌త చేయకుండే భీమా డ‌బ్బుతో పాటుగా పెన్ష‌న్‌ను కూడా కోల్పోవ‌ల‌సి ఉంటుంది. దీంతో పాటుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తుంది.

Advertisement

Advertisement


ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు చేయ‌డానికి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు గ‌డువును పొడిగించింది కేంద్రం. క‌రోనా మ‌హ‌మ్మారి, లోపాలు కార‌ణంగా జులై వ‌ర‌కు ఉన్న గ‌డువును ఆ త‌రువాత సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు, ఆ త‌రువాత ఆ గ‌డువును డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించింది. కేంద్ర‌ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసి రిటైర్ అయిన వారు వారి లైఫ్ స‌ర్టిఫికెట్ డాక్యుమెంట్ల‌ను ఈ నెల 31 లోగా స‌మ‌ర్పించాల్సి ఉంది. వృద్దుల‌కు క‌రోనా సోకే ప్ర‌మాదం ఉన్నందున పెన్ష‌న్ తీసుకునే అన్ని వ‌య‌సుల వారు త‌ప్ప‌నిస‌రిగా డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాలి. అదేవిధంగా ఈపీఎఫ్ఓ తో ఆధార్ ను అనుసంధానం చేస్తూ గ‌డువును పెంచింది. ఈ గ‌డువు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈ గ‌డువును పొడిగించింది.

Visitors Are Also Reading