తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఒక సాధారణ నటుడిగా కెరీర్ ని ప్రారంభించి హీరోగా మారారు. ఇక ఆ తరువాత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, రైటర్, సూపర్ స్టార్ గా మారి తనదైన ముద్ర వేసుకున్నారు. తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసే వారు. అందుకే కృష్ణ కి అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కృష్ణ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు కృష్ణ ని చూసేందుకు రెండు రోజుల నుంచి క్యూ కడుతూనే ఉన్నారు.
Advertisement
ఒకప్పుడు ఆయనకి ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవట. ఇక అప్పట్లో కృష్ణ పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులందరూ పండుగలా సెలబ్రేట్ చేసుకునేవారు. వరసగా 14 ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ.. ఆ తరువాత వచ్చిన అల్లూరి సీతారామరాజు మూవీని హిట్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కే దక్కుతుంది. కృష్ణ సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ 2008లో ఈ అభిమాన సంఘాలన్నీ కూడా దాదాపు కలిసిపోయాయి. ఇదిలా ఉంటే కృష్ణ కి స్టార్ హీరోలు కూడా డైహార్డ్ ఫ్యాన్సే.
Advertisement
Also Read : కృష్ణకు పద్మభూషణ్ రావడం వెనక అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటంటే..?
ప్రస్తుతం కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా సూపర్ స్టార్ కృష్ణ కి వీరాభిమాని. ఇక అప్పట్లో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఓ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ల పాటు ప్రెసిడెంట్ గా వ్యవహరించారు చిరంజీవి. తోడు దొంగలు ప్రమోషన్ లో భాగంగా ఈ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఓ పాంప్లేట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పాంప్లేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో కృష్ణతో పాటు చిరంజీవి కూడా యాక్ట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు తరువాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ అతి ఇష్టంగా తినే ఆహారం ఏంటో తెలుసా ?