Home » కృష్ణకు పద్మభూషణ్ రావడం వెనక అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటంటే..?

కృష్ణకు పద్మభూషణ్ రావడం వెనక అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala

ఘట్టమనేని కృష్ణ 1942 మే 31న జన్మించారు. ఆయన పూర్తి పేరు శివరామకృష్ణ మూర్తి. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడు దర్శకుడు,నిర్మాత గా వ్యవహారించారు.కృష్ణ 1978లో తెలుగు సినిమా హీరోగా ప్రజాధరణ సాధించి సూపర్ స్టార్ గా మారారు. 1964 ముందు సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964-1965 లో చేసిన తొలి సినిమా తేనె మనసులు. తన మూడవ సినిమా గూడచారి 116.ఈ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా 40 సంవత్సరాల పాటు దాదాపు 350 చిత్రాలు చేసి తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మారిపోయారు. 1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన ఈ సంస్థ ద్వారా పలు సంచలమైన చిత్రాలను తీశారు.

ALSO READ;సూపర్ స్టార్ కృష్ణ అతి ఇష్టంగా తినే ఆహారం ఏంటో తెలుసా ?

అయితే తేనె మనసులు సినిమా ప్రారంభమయ్యే నాటికి కృష్ణకు తన సొంత మరదలైన ఇందిరా దేవి తో వివాహం జరిగింది. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ,ఇందిరాలకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు.ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలన్నింటిలో దాదాపుగా సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన స్టార్డం సాధించిన తర్వాత 1972లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. 1980 లో ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగునాట కూడా సినిమా రంగంలోకి గ్లామర్ కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విధంగా కృష్ణ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయంలో కూడా చేరి కృష్ణ అంచలంచలుగా ఎదిగారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఎంతో గుర్తింపు సాధించారు. అంతటి ఘనత సాధించిన కృష్ణకు పద్మభూషణ్ అవార్డు రాకపోవడం దారుణమని ఒకానొక సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భావించారట. వెంటనే ఆయన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడి ఎన్నో రికార్డులు,ఘనతలు సాధించిన కృష్ణకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని పట్టుబట్టి 2009లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు పురస్కారం దక్కేలా చేశారని ఒకానొక ఇంటర్వ్యూలో కృష్ణే స్వయంగా తెలియజేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణని గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కే.వి. రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ నట శేఖర బిరుదు అందుకున్నారు. ఇలా తన నట రాజకీయ జీవితంలో అంచలంచలుగా ఎదిగిన కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం.

ALSO READ;ఆ నాలుగు కోరిక‌లు తీర‌కుండానే కృష్ణ లోకాన్ని విడిచారా..? ఆ కోరికలు ఏవంటే..?

Visitors Are Also Reading