Home » అర్జున్‌ తో పెళ్లికి మున్నీ ఓకే చెప్పేసిందా? సోషల్ మీడియాలో వైరల్..!

అర్జున్‌ తో పెళ్లికి మున్నీ ఓకే చెప్పేసిందా? సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వ్యవహారాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ లవ్ బర్డ్స్. త్వరలోనే ఈ ప్రేమ పక్షులు పెళ్లి పీటలు ఎక్కనున్నారు అంటూ బాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ మలైకా షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తలదించుకుని ముసిముసి నవ్వులు చిందిస్తూ మురిసిపోతున్న తన ఫోటోను షేర్ చేస్తూ నేను ఎస్ చెప్పాను అని క్యాప్షన్ ఇచ్చింది.

Also Read : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? అనారోగ్యంతో తండ్రి ఇద్దరు అన్నలు అలా..!

Advertisement

Manam
ఇక దీనికి తోడు షమితా శెట్టి, మహివిజ్ ఫుల్ కిత్ సామ్రాట్ వంటి సెలెబ్రెటీలు ఆమెకు కంగ్రాట్స్ చెప్పడం హార్ట్ లవ్ ఎమోజీలు షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆమె అర్జున్ కపూర్ తో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మరికొందరు ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా చేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. కావాలంటే ఆమె చేతికి ఎలాంటి ఎంగేజ్ మెంట్ రింగ్ లేదు చూడండంటూ స‌మాధానాలు ఇస్తున్నారు. మలైకాతో పెళ్లి గురించి ఇటీవల అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

Advertisement

Also Read : అల వైకుంఠపురం సినిమాలో చూపించిన ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..?

Manam

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు హాజర‌య్యాడు అర్జున్. అయితే మలైకాతో ప్రేమ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను ఇప్పుడు మలైకాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేను. కరోనా లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లు సినిమాలు చేయలేకపోయాను. దీంతో చాలా సమయం వృధాగా గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. నా వర్క్ నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా జీవిత భాగస్వామిని సంతోష పెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు” అని చెప్పుకొచ్చాడు.

Also Read : జగన్ పై సినిమా.. హీరో ఎవరంటే..?

 

Visitors Are Also Reading