Home » అల వైకుంఠపురం సినిమాలో చూపించిన ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..?

అల వైకుంఠపురం సినిమాలో చూపించిన ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అల్లు అర్జున్,పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అల వైకుంఠపురం. ఈ మూవీ 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మరో అంశం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ చిత్రంలో కనిపించే ఇంటిలో టబు ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అసలైన తల్లిదండ్రులు ఉంటారు.

Advertisement

ఈ మూవీ ప్రారంభంలోనే అల్లు అర్జున్ ఈ ఇంట్లోకి అడుగు పెడతాడు. అప్పుడు ఇంటి గేట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని సన్నివేశాలు ఇంటిలో తీసిన సీన్స్ ఎంతో అందంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇల్లు చాలా అందంగా ఉంది.ఇంద్ర భవనంలా కనిపించే ఇంటిని చూసి ఫిదా అయ్యారు. ఇంటి ముందు భారీ గేట్లు,ఇంట్లో ఫర్నిచర్,చుట్టూ విశాలమైన స్థలం అందరినీ ఆకట్టుకుంది. దీంతో పాటుగా అల్లు అర్జున్ కు ఈ ఇల్లు కూడా బాగా నచ్చేసిందట.

Advertisement

also read:జగన్ పై సినిమా.. హీరో ఎవరంటే..?

తాను కూడా అలాంటి ఇంటిని కట్టుకోవాలని బన్నీ ఎప్పటినుంచో అనుకున్నారట. మరి అందమైన ఇల్లు మరెవరిదో కాదు, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్తది.. ఇంటి నిర్మాణం కోసం దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేశారట. ఈ సినిమా బ్యానర్ నిర్మాత అయిన రాధాకృష్ణకు ఇంటి యజమానులు బంధువులు అవుతారు. అయితే సినిమా ఆర్ట్ డైరెక్షన్ భారీ సెట్స్ నిర్మించాలని చెప్పడంతో రాధాకృష్ణ ఆ ఇల్లు చూపించి అదే ఇంటిని ఫైనల్ చేశారట. ఇక ఇంటికి బయట ఉండే సీన్స్ కోసం ఐదు కోట్లతో అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసినట్టు సమాచారం.

also read:

Visitors Are Also Reading