Home » జగన్ పై సినిమా.. హీరో ఎవరంటే..?

జగన్ పై సినిమా.. హీరో ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాల క్రీతం థియేటర్లలో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చిత్రం సీతారామం.. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయమందుకుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాలో కూడా వస్తున్నారని సమాచారం. అది కూడా సీఎం జగన్ కు సంబంధించిందట.. యాత్ర-2 పేరుతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Advertisement

2024 ఎన్నికల నేపథ్యంలో జగన్ గురించి పాజిటివ్ గా యాత్ర-2 సినిమా తెరకెక్కించబోతున్నారని బోగట్టా.మహి వి రాఘవ డైరెక్షన్లో ఈ సినిమా రానుండగా ముఖ్యమంత్రి జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వైయస్సార్ చనిపోయిన తర్వాత ఎదురైనా పరిస్థితులు, జగన్ ఎదుర్కొన్న తీరు ప్రధానంగా ఈ మూవీలో చూపించబోతున్నారని సమాచారం. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఈ ప్రాజెక్టుకు దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా వరుస సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. యాత్ర-2 సినిమాకు నిర్మాత ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు.

Advertisement

also read:బిగ్‌బాస్ 6 సీజన్ లో గీతూకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

సీఎం జగన్ కు ఎదురైన పరిస్థితుల గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని సమాచారం అందుతోంది. ఈసినిమా వైసిపికి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో మమ్ముట్టి కూడా నటిస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సినిమా సినిమాకు దుల్కర్ సల్మాన్ పారితోషకం పెరుగుతుండడం గమనార్హం.

also read:

Visitors Are Also Reading