ప్రస్తుత మన జీవన విధానంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఏ చిన్న పని చేయాలన్న చేతిలో డబ్బు ఉండాల్సింది. అసలు డబ్బు లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం.
Advertisement
మానవ జీవితాన్ని శాసిస్తున్న ఈ డబ్బు ఎప్పుడు మన చేతిలోనే తిరుగుతూ ఉంటుంది. అయితే మన చేతిలో తిరిగే ఈ డబ్బు నోట్లపై ఉండే సమాచారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నోట్లపై నాలుగు లైన్లు ఉంటాయి. అది ఎప్పుడైనా గమనించారా? అసలు ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో ఆలోచించారా? అవి ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
Advertisement
డబ్బు నోట్లపై ఉండే ఆ నాలుగు గీతలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు. వీటిని దృష్టిలో లోపం ఉన్న వారికోసం ప్రత్యేకంగా నోట్లపై వేస్తారు. ఎందుకంటే ఈ లైన్ లో టచ్ చేసి ఇ అది ఎంత నోటు అనే విషయాన్ని చెప్పొచ్చట. అయితే 100, 200, 500, 2000 నోట్లపై వేర్వేరు రకాల లైన్స్ ఉంటాయి. వంద రూపాయల నోటు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. అయితే దానికి రెండు సున్నాలను ఆడ్ చేసారు. ఇక 500 నోటు ఐదు గీతలు, 2000 నోటు 7 లైన్లు ఉంటాయి. అందులో ఈ గీతలు సహాయంతో నోటు విలువను అర్థం చేసుకుంటారు అన్నమాట. అదన్న మాట సంగతి… నోటుకి చివర్లో ఆ 4 గీతల రహస్యం. మరి వాళ్లకు కూడా డబ్బు గురించి తెలియలిగా… లేదంటే కళ్ళున్న వాళ్ళే మోసపోతున్న ఈరోజుల్లో కళ్ళు లేని వాళ్ళ సంగతి ఇక అంతే.
Also Read: గోరింటాకు పెట్టుకుంటే.. ఆ కష్టాలకు చెక్ !