మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఈ మధ్య కాలంలో చాలా మంది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారనే చెప్పాలి. క్రియేటివిటీకి కాదేది అనర్హం అన్న విధంగానే సరికొత్త ఆలోచనలతో ఎప్పుడూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. తమలో ఉన్నటువంటి సృజనాత్మకతను సరికొత్తగా చూపిస్తూ.. అటు తమ ఐడియాలతో సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారనే చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో వినూత్నమైన వీడియోలకు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది.
Also Read : స్త్రీలు పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు.. ప్రతి భర్త చూడాల్సిందే..?
Advertisement
ముఖ్యంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించే వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలలో కొంతమంది వ్యక్తులు చూపించిన క్రియేటివిటీ చూసి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక బస్సు డ్రైవర్ చూపించిన క్రియేటివిటీకి నెటిజన్లు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
Advertisement
Also Read : ధూమపానం కంటి ఆరోగ్యానికి ప్రమాదం.. జాగ్రత్త..!
उत्तर प्रदेश परिवहन निगम की बस में जुगाड़ से चलता वाइपर 👇@UPSRTCHQ @UPSRTC_Meerut pic.twitter.com/IOofdiNbRE
— Vipin Rathaur (@VipinRathaur) October 9, 2022
ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన బస్సు నడపడం కోసం ఉన్న సమస్యలను ఎలా అధిగమించాడో ఈ వీడియోలో తెలుస్తోంది. రాథోడ్ అనే ఒక బస్సు డ్రైవర్ పనిచేస్తున్నాడు. సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ధూళి అద్దం మీద పేరుకుపోయినప్పుడు దానిని శుభ్రం చేసేందుకు బస్సు కార్లకి వైపర్ లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుకు ఉన్న వైపర్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వినూత్నంగా ఆలోచించి ఒక వాటర్ బాటిల్ సాయంతో కొత్త వైపర్ తయారు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also Read : మీ చెవిలో ఏదైనా పడిందా..? అయితే ఇలా చేస్తే ఫలితం పక్కా ..!