Home » మీ చెవిలో ఏదైనా ప‌డిందా..? అయితే ఇలా చేస్తే ఫ‌లితం ప‌క్కా ..!

మీ చెవిలో ఏదైనా ప‌డిందా..? అయితే ఇలా చేస్తే ఫ‌లితం ప‌క్కా ..!

by Anji

సాధార‌ణం ఎవ‌రికైనా చెవిలో ఏదైనా పడితే ఆ ఇబ్బంది తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి భరించలేనంత నొప్పి కూడా వస్తుంది. ఏ పని చేయలేము. ఇక చిన్నారులు అయితే ఏమైందో తెలియక ఏడుస్తుంటారు. చిన్నారులు చదువుతున్నప్పుడో.. రాస్తున్నప్పుడో పెన్ను, బలపం, పిన్నీసు లాంటి వాటిని ఏదో ఒకటి చెవిలో పెట్టుకుంటారు. ఆ సమయంలో పెన్ను మూతలు, బలపం ముక్కలు చెవిలో పడిపోతాయి. దాన్ని తీసే క్రమంలో కాస్త గట్టిగా అంటే లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

పిల్లలు వాటిని గట్టిగా నెట్టినప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక నిద్రపోతున్న సమయంలో ఒక్కోసారి చీమలు, పురుగులు చెవిలోకి వెళ్తాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. దాన్ని తీయడానికి చేసే ప్రయత్నంలో చెవి లోపలి భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఏం చేయాలో నిపుణులు పలు సూచనలు చేశారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

  • ఇలాంటి పరిస్థితుల్లో తలను సాధ్యమైనంత వరకు కిందికి వచ్చి ఉంచాలి. బలపం, పుల్లలు, పెన్సిల్స్, పెన్నుల మూతలు కనిపిస్తే జాగ్రత్తగా తీయడానికి వీలు ఉంటేనే తీయాలి.

  • చీమలు, పురుగులు చెవి లోపలి కి వెళ్లి కదలాడుతుంటే రెండు చుక్కల ఆలివ్ నూనె, బేబీ ఆయిల్ ను గాని వేయాలి. ఇలా చేయడంతో అవి చనిపోతాయి. వేరే వస్తువులు ఉంటే మాత్రం ఆయిల్ పోయొద్దు.చెవి లోపల ఏమైనా ఉంటే మాత్రం తీయకుండా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

Also Read :  స్త్రీలు పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు.. ప్రతి భర్త చూడాల్సిందే..?

Visitors Are Also Reading