Home » ధూమ‌పానం కంటి ఆరోగ్యానికి ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

ధూమ‌పానం కంటి ఆరోగ్యానికి ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

by Anji
Ad

 

ప్ర‌స్తుతం కంప్యూట‌ర్ కాలం న‌డుస్తోంది. రోజు రోజుకు టెక్నాల‌జీ పెరుగుతోంది. వేగంగా మారిపోతున్న సాంకేతిక కారణంగా లైఫ్ అంతా డిజిటల్ మయంగా మారింది. చాలా వ‌ర‌కు ఎక్కువ సమయం స్క్రీన్ ల పైనే గడుపుతున్నారు. ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, ట్రావెలింగ్ అయిన స్క్రీన్ తోనే గడపాల్సిన అవసరం ఉంది. కానీ తెరపై ఎక్కువ సమయం గడపడం మనకు కళ్ళకు మంచిది కాదు.

Also Read : కంటి చూపు త‌గ్గుతున్న‌ట్టు అనిపిస్తోందా ? మీ డైట్‌లో ఇది త‌ప్ప‌క చేర్చుకోండి..!

Advertisement

 

కంటి వ్యాధులు, అంధత్వం వంటి సమస్యల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. కంటిచూపు, దాని సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి తాజాగా అక్టోబ‌ర్ 13న‌ ప్రపంచ దృష్టి దినోత్సవం గా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం జరుపుకుంటారు. కళ్ల సంరక్షణ కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. దీనితోపాటు ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఇది మీ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Also Read : పాములు ఇళ్ల‌లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

స్క్రీన్ పై ఎక్కువ సమయం గడిపేటప్పుడు లేదా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. సూర్యుని నుంచి విడుదలయ్యే హానికరమైన కిరణాలు మీ కళ్ళను ప్రభావితం చేస్తాయి. అందుకోసం బయటకు వెళ్లేటప్పుడు కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ ముందు పరిమిత సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీ స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తాయి. ధూమపానం తీసుకోవడం వల్ల మీ ఆప్టికల్ నరాలు దెబ్బతింటాయి. కండరాల క్షీణత వంటి అనేక ఇతర సమస్యలు వస్తాయి. ధూమపానం చేస్తే వెంటనే దానికి దూరంగా ఉండడం బెట‌ర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే 3 సంకేతాలు తప్పకుండా ఇస్తుంది.. ఇందులో 2 చాలా ఇంపార్టెంట్..!!

 

Visitors Are Also Reading