Home » ఉద‌యం నిద్ర లేవ‌గానే ఏ వ‌స్తువులు చూడ‌కూడ‌దో తెలుసా..?

ఉద‌యం నిద్ర లేవ‌గానే ఏ వ‌స్తువులు చూడ‌కూడ‌దో తెలుసా..?

by Bunty
Ad

కొంత‌మంది తొంద‌ర‌గా లేవాల‌ని అనుకుంటారు..లేటుగా నిద్ర పోవ‌డం మూలంగా లేటుగా లేస్తుంటారు. చీపురును త‌న్న‌డం కాని, కొన్ని వ‌స్తువుల‌ను చూడ‌డం కానీ, జుట్టు వీర‌పోసుకున్న ఆడ‌వారిని చూడ‌డం వంటివి చూడ‌డం ద్వారా కొంత మంది ఏప‌ని జ‌ర‌గ‌కుండా ఉంటారు.  కొంత మంది లేవ‌గానే త్వ‌ర‌ప‌డ‌కుండా ఉత్త‌ర దిక్కుగాని, తుర్పు దిక్కుగాని చూసే విధంగా నిద్ర లేవాలి.

Advertisement

కొంత మంది నిద్రలేవ‌న‌గానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారు, చిన్న పిల్లల ముఖం చూడటమో  చేస్తుంటారు.  కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసానేమో అని మధనపడిపోతారు. ముఖ్యంగా పడకగదిలో అద్దం మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడరాదు. ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి. ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్య లేదా మహిళ ముఖాన్నిచూడవద్దు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి.మహిళలు నిద్ర మేల్కోన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి పనులు మొదలుపెడతారు. కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను ఎదురుగా ఉంచడం చేయరాదు.చాలా మంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గోడలకు వేలాడ‌దీస్తారు. ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం అంతా మంచిది కాదు.

Advertisement

లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి. మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటినికి ఆ మాత భరిస్తుంది కాబట్టి. ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలి. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టుపెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది.

Visitors Are Also Reading